Categories: LATEST UPDATES

వృద్ధి బాటలో ఫర్నిచర్ మార్కెట్

  • 2023-2028 కాలంలో 11.6 శాతం వృద్ధి అంచనా

ఇల్లు అంటే సిమెంట్, ఇటుకలు, ఫ్లోరింగ్, టైల్స్ మాత్రమే కాదు.. పాలరాయితో ఇంద్రభవనం నిర్మించినా సరే.. అందులో సరైన ఫర్నిచర్ లేకుంటే సమగ్రత చేకూరదు. ఇల్లు ఎంత అందంగా డిజైన్ చేసినప్పటికీ, సరైన ఫర్నిచర్ తో ఇంటిని అలంకరించినప్పుడు దానికి మరింత వన్నె చేకూరుతుంది. అంటే రియల్ రంగంలో సైతం ఫర్నిచర్ ది కీలక పాత్రే. ఇల్లు కొనుగోలు తర్వాత చేసే మొదటి పని ఫర్నిషింగే కదా? మరి మన దేశంలో ఫర్నిచర్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామా? భారతదేశ పర్నిచర్ మార్కెట్ 2023-2028 మధ్య కాలంలో 11.6 శాతం వృద్ధిరేటు ప్రదర్శిస్తుందని అంచనా. సాధారణంగా ఫర్నిచర్ అంటే కుర్చీలు, కేబినెట్లు, బెడ్స్, టేబుళ్లు, డెస్కులు, డ్రస్సర్లు, అల్మరాల వంటివి ఉంటాయి. వీటిని ప్లాస్టిక్, మెటల్, పాలరాయి, కలప, గాజు, బట్టలు లేదా ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. వీటికి తక్కువ నిర్వహణతోపాటు స్థితిస్థాపకంగా ఉంటుంది. ఏ గదికైనా చక్కదనం, ఆకర్షణ, అధునాతనను జోడిస్తుంది. ఇక ఫర్నిచర్ అనేది సుదీర్ఘ షెల్ఫ్ లైఫ్ కలిగి ఉంటుంది. వీటిని చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. పైగా సూపర్ మార్కెట్లు, స్పెషాలిటీ స్టోర్లు, ఆన్ లైన్ స్టోర్లు, హైపర్ మార్కెట్లలో విస్తృతంగా అందుబాటులో ఉంటాయి.

భారత ఫర్నిచర్ ట్రెండ్ ఇలా..

దేశంలో వార్డ్ రోబ్స్, సోఫాల వంటి ఆధునిక ఇంటీరియర్లకు డిమాండ్ ఎక్కువ. అవి అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో చాలామంది వీటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో మనదేశ ఫర్నిచర్ మార్కెట్ ను ముందుకు నడిపించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలోని ప్రత్యేకమైన, అసాధారణమైన ఫర్నిచర్ డిజైన్, దాని గొప్ప హస్తకళ, ఆకర్షణీయమైన సంప్రదాయ కళ, శైలి కారణంగా మార్కెట్ వృద్ధి బాగా పెరుగుతోంది.

అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులలో మాడ్యులర్, అత్యాధునిక ఫర్నిచర్ వైపు మొగ్గు చూపిస్తుండటం అటు ఆన్ లైన్, ఇటు ఆఫ్ లైన్ లలో ఫర్నిచర్ మార్కెట్ దూసుకెళ్లడానికి కారణమవుతోంది. వీటికి తోడు అభివృద్ధి చెందుతున్న భారత రియల్ పరిశ్రమ, పెరుగుతున్న జనాభా, చౌక గృహాల అందుబాటు వంటివి కూడా మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయి. మరోవైపు ప్రముఖ కంపెనీలు యానిమేషన్, ఇతర అధునాతన సాంకేతకతలను ఉపయోగించి ఫర్నిచర్ త్రీడీ వీక్షణను పరిచయం చేయడానికి పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కార్యకలాపాల్లో విస్తృతంగా పెట్టుబడి పెడుతున్నారు. ఇది రాబోయే సంవత్సరాల్లో భారతదేశ పర్నిచర్ మార్కెట్ ను మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.

This website uses cookies.