Categories: LATEST UPDATES

25 డీల్స్.. రూ.11,760 కోట్లు

  • మూడో త్రైమాసికంలో రియల్ రికార్డు

రియల్ ఎస్టేట్ రంగంలో మూడో త్రైమాసికం సత్తా చాటింది. ఈ ఏడాది క్యూ3లో 1.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,760 కోట్లు) విలువైన 25 డీల్స్ జరిగాయని కన్సల్టింగ్‌ సంస్థ గ్రాంట్‌ థోర్న్టంన్ భారత్ నివేదిక పేర్కొంది. ప్రధానంగా డెవలపర్స్‌ చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌)దే వీటిలో ప్రధాన వాటాగా వెల్లడించింది. రియల్టీ రంగ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌(క్యూ3)లో 25 డీల్స్‌ నమోదయ్యాయని.. పరిమాణంరీత్యా ఇది సరికొత్త రికార్డుకాగా.. విలువ(రూ. 11,760 కోట్లు)రీత్యా 2023 ఏడాది క్యూ2 తదుపరి గరిష్ట విలువగా నమోదైందని తెలిపింది.

ప్రధానంగా క్విప్‌ జారీ పుంజుకోవడం ఇందుకు దోహదపడిందని వివరించింది. వీటికి రెసిడెన్షియల్‌, వాణిజ్య విభాగాలలో పీఈ నిధులు జత కలిశాయని, అంతేకాకుండా రియల్టీ టెక్నాలజీ కంపెనీలలోనూ ఒప్పందాలు కలిసొచ్చాయని తెలిపింది. క్యూ3లో నమోదైన మొత్తం డీల్స్ లో 5.1 కోట్ల డాలర్ల విలువైన 8 ఒప్పందాలు కొనుగోళ్లు, విలీనం(ఎంఅండ్‌ఏ) విభాగంలో జరిగాయి. ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) విభాగంలో 40.1 కోట్ల విలువైన 12 డీల్స్‌ నమోదయ్యాయి.

This website uses cookies.