తప్పుడు పత్రాలు సమర్పించినందుకు ఓసీ రద్దు
ఉత్తర బెంగళూరులోని థనిసంద్ర మెయిన్ రోడ్డులో 2 వేల యూనిట్ల అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ శోభా సిటీకి బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) షాక్ ఇచ్చింది. ఆ కాంప్లెక్స్ కు జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) రద్దు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించిన విషయం తెలియడంతో బీబీఎంపీ ఈ నిర్ణయం తీసుకుంది. శోభా లిమిటెడ్ సంస్థ తన శోభా సిటీ ప్రాజెక్టు కోసం తప్పుడు పత్రాలు సమర్పించి ఓసీ పొందింది. 2013, 2016, 2019 సంవత్సరాల్లో అగ్నిమాపక శాఖ నుంచి బిల్డర్ పొందినట్టుగా పేర్కొన్న నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు, క్లియరెన్స్ సర్టిఫికెట్లు అన్నీ తప్పుడు పత్రాలని తెలిపింది. అయితే, దీనిని శోభా లిమిటెడ్ సంస్థకు చెందిన అధికారి దీనిని ఖండించారు. తాము 2017లో ఓ పత్రం సమర్పించామని.. దానిని 2017 డాక్యుమెంట్ గా పరిగణించి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అయితే, శోభా సమర్పించిన తాజా పత్రాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.