ఒలంపిక్స్ లో రజత పతకం సాధించిన మొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. తన ప్రతిభతో దేశానికి ఎంతో పేరు తెచ్చిన ఆమె ఇల్లు హైదరాబాద్ లోని ఓ కొండపై ఉంది. ఫిల్మ్ నగర్ లోని ఆమె ఇంటి నుంచి చూస్తే హైదరాబాద్ నగర వీక్షణం అదిరిపోతుంది. సింధు గచ్చిబౌలికి మారినప్పుడు ప్రపంచ చాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో నివసిస్తుండగా.. వరుస పెట్టి పతకాలు సొంతం చేసుకుంటున్నారు. అవన్నీ ఆమెకు అద్భుతమైన మధురానుభూతులు.
‘నా ఇల్లే నాకు ఆశ్రయం. జీవితం చాలా బాగున్నప్పుడు మీరు అంతే రిలాక్స్ గా ఉండగలరు. ఇంట్లో కొన్ని అలంకరణలు శాంతి భావాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి. మీరు ఆ స్పేస్ ను ఎలా అలంకరిస్తారు అనే అంశం మీరు అందులో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారనే దానిపై భారీ ప్రభావం చూపిస్తుంది. మీరు ఇష్టపడే వస్తువులతో డిజైన్ చేసిన ప్రదేశం.. మీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చిందరవందరగా ఉన్న గదులు నా మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి’ అని సింధు వివరించారు. ఇక తన ఇంటిని వ్యక్తిగత అభయారణ్యంగా ఎలా మార్చుకున్నారో చెప్పారు. ‘నేను టోర్నమెంటుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నా మేనల్లుడు, తల్లిదండ్రులతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాను. మొదటి అంతస్తులో బోలెడెంత చూడొచ్చు. మీరు పై అంతస్తుకు వెళ్లారంటే.. నగరం మొత్తాన్ని ఒకే దృశ్యంలో చూస్తారు. నేను అలసిపోయినప్పుడల్లా నా చుట్టూ పచ్చదనం నిండి ఉండాలని కోరుకుంటాను. అందుకే హైదరాబాద్ లోని ఓ కొండపై నా ఇంటిని నిర్మించుకున్నాను’ అని సింధు తెలిపారు.
మూడు అంతస్తుల్లో ఉన్న సింధు హిల్ టాప్ ఇల్లు.. బోల్డ్ యాక్సెంట్లతో మినిమలిస్టిక్ లేఔట్ల మిశ్రమంగా కనిపిస్తుంది. ఇల్లంతా పూర్తి స్పేషియస్, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సింధు ఇంట్లో అత్యుత్తమ ప్రదేశం అంటే నిస్సందేహంగా ఆమె పతకాలు ఉన్న గదే. అక్కడ ఉన్న పలు ట్రోఫీలు, పతకాలు ఆమె తన జీవితంలో పొందిన గౌరవాన్ని ప్రతిబింబింపజేస్తాయి. ఇక ఆ గది పక్కనే సింధు జిమ్ ఉంది. ఆమె కృషి, పట్టుదల, దృఢ సంకల్పం అక్కడ కనిపిస్తుంది. ‘సాధారణంగా క్రీడాకారులు ఓ టోర్నమెంట్ తర్వాత నిద్రపోతారు. కానీ నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలా రిఫ్రెష్ గా భావిస్తాను. నా కుక్కతో ఆడుకుంటాను. ఓదార్పు, ఒత్తిడి లేని వాతావరణం కావాలని కోరుకుంటాను. మాకు ఒకటి కాదు చాలా తోటలున్నాయి. అవి కళ్లకు మంచి అనుభూతినిస్తాయి. వాటిని సంరక్షించడానికి గార్డెనింగ్ విజ్ గా ఉండాల్సిన అవసరం లేదు. మేం మా తోటల్లో సాయంత్రం వేళ సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. అలాగే ఆర్యన్ తో ఆడుకుంటాం’ అని పేర్కొన్నారు.
కుటుంబానికి కావాల్సినవన్నీ ఒకేచోట ఉండటమే కాకుండా ఇటు సౌకర్యం.. అటు ఫంక్షనాలిటీ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని సింధు ఇంటిని డిజైన్ చేశారు. మొదటి రెండు అంతస్తుల్లో కుటుంబం నివసిస్తుంది.
మూడో అంతస్తులో హోం థియేటర్, టెర్రస్ గార్డెన్ ఉన్నాయి. ‘నా తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. అందువల్ల వారికి అవసరమైన స్థలం ఉండేలా చూసుకోవాలి. మీరు మా ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఆయన అర్జున అవార్డును చూస్తారు. నాకు ఆ అవార్డు 2013లో వచ్చింది. మా నాన్న నన్ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఉండేలా ప్రోత్సహించారు. నా శిక్షణ సెషన్లు అన్నింటిలో ఆయన ఉంటారు. అది నన్ను మరింత మెరుగ్గా చేయడానికి ఉపయోగపడుతుంది. మా నాన్న చాలా గమనిస్తారు’ అని సింధు వెల్లడించారు.
సింధు ఇల్లు శాంతికి స్వర్గధామం. ఆమె ఇంటి ఫంక్షనల్ డిజైన్ ఆమె విశ్రాంతి తీసుకోవడానికి, ఆమె ఇష్టపడేవారితో సమయం గడపడానికి సహాయపడుతుంది. ‘నేను ఇంట్లో జిమ్ కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తాను. అక్కడ వర్కవుట్ చేయడం ఎల్లవేళలా నాకు ప్రాధాన్యత కలిగిన అంశం.
హోం జిమ్ లో ఉండే సౌలభ్యం నాకు చాలా ఇష్టం. బరువు ఎత్తే శిక్షణ నుంచి రన్నింగ్, సైక్లింగ్ వరకు అన్నీ నా హోం జిమ్ లోనే జరుగుతాయి. చెమట పట్టిన తర్వాత వచ్చే సంపూర్ణ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వర్కవుట్ చేయడం గొప్ప అనుభూతినిస్తుంది. నా జిమ్ బేస్ మెంట్ లో ఉంది. నేను ఏ మ్యాచ్ లో గెలిచినా.. బలం, శక్తి నా ఇంట్లోని జిమ్ నుంచే వస్తుంది. ఫిట్ నెస్ అంటే శారీరక ఆకర్షణ లేదా బరువు తగ్గడం కాదు. నేను ఓ క్రీడాకారిణిని. గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ, అన్వేషించే స్వేచ్ఛ అనేది నా ఉద్దేశం’ అని సింధు తెలిపారు.
‘నాకు బంగారం నా విజయాల మాదిరిగానే శక్తిని సూచిస్తుంది. మీరు దానిని నా ఇంట్లో చూసినప్పుడు అస్సలు గంభీరంగా ఉండదు. అది నా ఇంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది. మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది ఖరీదైన పద్ధతి కాదు’ అని పేర్కొన్నారు. ఇక అలంకరణ విషయంలో ఆమె చెక్క పలకలను కూడా ఎక్కువగా వినియోగించారు. ‘చెక్క వైన్ లాంటిది. వయసు పెరిగేకొద్దీ మెరుగవుతుంది. దాని అందాన్ని ఎప్పటికీ కోల్పోదు. ఆధునిక సామగ్రి ఎంతగా పెరుగుతున్నప్పటికీ, నేను నా ఇంటి విషయంలో కలపకే ప్రాధాన్యత ఇస్తాను. స్థిరంగా ఉండటం అనేది ముఖ్యం కావడంతో మేం మా ఇంటీరియర్ డిజైన్ లో బయోఫిలిక్ డిజైన్ పొందుపరచడానికి ప్రయత్నించాం. మొక్కలు, కలపను జోడించడం వల్ల మా ఇంట్లో ప్రకృతి తాండవిస్తుంది’ అని చెప్పి ముగించారు