Categories: LATEST UPDATES

మార్చిలో ఒక్క 3.5 బీహెచ్‌కే ఫ్లాట్ కూడా రిజిస్ట‌ర్ కాలేదు!

మార్చిలో 6,415 ఆస్తులు రిజిస్ట‌ర్ అయ్యాయ‌ని నైట్ ఫ్రాంక్ నివేదిక‌లో వెల్ల‌డైంది. వీటి విలువ ఎంత‌లేద‌న్నా రూ.4000 కోట్ల దాకా ఉంటుంద‌ని అంచ‌నా. అయితే, 2023 మార్చితో పోల్చితే.. ఎనిమిది శాతం రిజిస్ట్రేష‌న్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి.రూ.50 ల‌క్ష‌ల్లోపు ధ‌ర గ‌ల స్థిరాస్తులే సుమారు 59 శాతం న‌మోద‌య్యాయి. కోటి నుంచి రెండు కోట్ల ధ‌ర గ‌ల‌వి 13 శాతం రిజిస్ట‌ర్ కాగా.. రెండు కోట్ల కంటే అధిక విలువ గ‌ల ఆస్తులు సుమారు రెండు శాతం రిజిస్ట‌ర్ అయ్యాయి.

వెయ్యి నుంచి రెండు వేల చ‌ద‌ర‌పు అడుగుల ఇళ్లే డెబ్బ‌య్ శాతం దాకా రిజిస్ట‌ర్ అవ్వ‌గా.. మూడు వేల‌కు పైగా ఎస్ఎఫ్‌టీ గ‌ల‌వి మూడు శాతం రిజిస్ట‌ర్ అవ్వ‌డం గ‌మ‌నార్హం. 500 చ‌ద‌ర‌పు అడుగుల కంటే త‌క్కువ ఇళ్ల రిజిస్ట్రేష‌న్ రెండు శాతంగా న‌మోదైంది. 2024 జ‌న‌వ‌రి నుంచి మార్చిలోపు.. కొండాపూర్‌, కోకాపేట్‌లో ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లు రిజిస్ట‌ర్ అవ్వ‌గా.. 3.5 బీహెచ్‌కే ఫ్లాట్లు ఒక్క‌టి కూడా రిజిస్ట‌ర్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదే గ‌తేడాదిలో మూడు శాతం న‌మోద‌య్యాయి.

This website uses cookies.