Categories: TOP STORIES

బీహెచ్ఈఎల్ నుంచి శంషాబాద్‌కు మెట్రో

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

మెట్రో కానీ ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామ‌ని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు ముందు ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన రూట్ల‌తో పోలిస్తే దూరం త‌గ్గిస్తామ‌న్నారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్ర‌యం దాకా 32 కిలోమీట‌ర్ల మేర‌కు మెట్రోను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వ‌ర‌కూ మెట్రో ఉంటుంద‌న్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్టుకి వెళ్లే మెట్రో లైనుకి లింకు చేస్తామ‌న్నారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు మెట్రో పొడిగిస్తామ‌న్నారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రో ని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామ‌ని ప్ర‌క‌టించారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టు కి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండ‌ర‌ని మ‌రోసారి అభిప్రాయ‌ప‌డ్డారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుంద‌న్నారు.

* ఫార్మా సిటీకి సంబంధించిన త‌మ ప్ర‌ణాళిక‌ల్ని వివ‌రించారు. ఫార్మాసిటీ ని అంచలంచెలుగా ఓఆర్ఆర్ మ‌రియు రీజిన‌ల్ రింగ్ రోడ్డు మ‌ధ్య ప్ర‌త్యేక క్ల‌స్ట‌ర్‌గా ఏర్పాటు చేస్తామ‌న్నారు. జీరో కాలుష్యం తో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అక్కడనే అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహనిర్మాణం కూడా ఉంటుంద‌ని తెలిపారు. అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయ‌న్నారు.

This website uses cookies.