Categories: Celebrity Homes

అలియాభట్ ఫ్లాట్ అద్దె రూ.9 లక్షలు

బాలీవుడ్ నటి అలియాభట్ కు చెందిన నిర్మాణ సంస్థ ముంబై బాంద్రాలో ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుంటోంది. ఇందుకోసం నెలకు రూ.9 లక్షల అద్దె చెల్లించనుంది. అలియా నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్.. బాంద్రా పాలిహిల్ ప్రాంతంలోని నర్గిస్ దత్ రోడ్‌లో ఉన్న ఓ భవనంలో ఆరో అంతస్తులోని ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. నరేంద్ర శెట్టి అనే వ్యక్తి రూ.36 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత ఈ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకున్నారు.

నాలుగేళ్ల కాలనికి దీనిని లీజుకు తీసుకోగా.. ఏడాదికి 5 శాతం చొప్పున అద్దె పెరుగుతుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21న ఈ లావాదేవీ జరగ్గా.. రూ.1.25 లక్షల స్టాంపు డ్యూటీ, రూ.వెయ్యి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 2023లో ముంబై బాంద్రా వెస్ట్ లో రూ. 37.80 కోట్లకు అపార్ట్ మెంట్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. కాగా, ముంబైలోని పాలిహిల్ ప్రాంతం అనేకమంది బాలీవుడ్ తారలకు నిలయంగా ఉంది. పలువురు బాలీవుడ్ తారలు, క్రికెటర్లు మరియు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఇళ్ళు కొనుగోలు చేశారు. స్థానిక బ్రోకర్ల ప్రకారం, అనేక లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుల్లో చదరపు అడుగు ధర రూ.లక్ష అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

This website uses cookies.