బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన రాజభవనాన్ని ఖాళీ చేయబోతున్నారు. త్వరలోనే ఆయన ఉంటున్న రాజభవనం మన్నత్ నుంచి అద్దె ఇంటికి మారనున్నారు. కనీసం రెండేళ్లపాటు అద్దె ఇంట్లోనే ఉండనున్నారు. ఇందుకోసం ఆయన ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ముంబైలో షారుఖ్ ఖాన్ నివసించే బంగ్లా పేరు మన్నత్. అది గొప్ప పర్యాటక ఆకర్షణగా మారింది. ఐకానిక్ బాంద్రా బ్యాండ్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఈ ల్యాండ్ మార్క్ బంగ్లా వద్ద ప్రతిరోజూ వందలాది మంది షారుఖ్ అభిమానులు కనిపిస్తారు. తమ అభిమాన నటుడితో సెల్ఫీల కోసం వచ్చి వెళ్తుంటారు. దాదాపు 25 సంవత్సరాలుగా షారుఖ్ కుటుంబం అందులోనే నివసిస్తోంది.
అయితే, ఈ ఏడాది చివరిలోగా షారుఖ్ కుటుంబం ఆ బంగ్లాను ఖాళీ చేసి అద్దె ఇంటికి వెళుతోంది. మన్నత్ ను పునరుద్ధరించనుండటమే ఇందుకు కారణం. ఈ బంగ్లాకు అదనపు అంతస్తులు జోడించాలని షారుఖ్ కుటుంబం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పనులు మే నెలలో ప్రారంభం కానున్నాయి. మన్నత్ అనేది గ్రేడ్-3 వారసత్వ నిర్మానం. ఈ భవంనలో ఏమైనా మార్పులు చేయాలంటే కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. దీంతో మే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో షారుఖ్ కుటుంబం బంగ్లా నుంచి అద్దె ఇంటికి మారనుంది. షారుఖ్, ఆయన భార్య గౌరీ, పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్ లు బాంద్రా పాలి హిల్ ప్రాంతంలోని ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్ భవనంలోని నాలుగు అంతస్తులకు మకాం మారుస్తున్నారు.
షారుఖ్ ఈ ఫ్లాట్లను చిత్ర నిర్మాత వాషు భగ్నాని నుంచి లీజుకు తీసుకున్నారు. వాషు భగ్నానీ కుమారుడు, నటుడు జాకీ భగ్నాని, ఆయన కుమార్తె దీప్షికా దేశ్‌ముఖ్‌తో ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం నాలుగు అంతస్తుల్లో ఖాన్ కుటుంబంతోపాటు వారి భద్రతా సిబ్బంది, ఇతర సిబ్బంది ఉంటారని సమాచారం. ఈ నాలుగు అంతస్తులకు షారుఖ్ ఖాన్ నెలకు రూ.24 లక్షల అద్దె చెల్లించనున్నారు. మూడేళ్ల కాలానికి లీజుకు తీసుకుని.. రూ.36 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించారు. షారుఖ్ ఖాన్ ఈ భవనంలోని మొదటి, రెండు.. ఏడు, ఎనిమిది అంతస్తుల్లోని రెండు డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్‌లను లీజుకు తీసుకున్నారు. పూజాకాసా అనే ఈ భవనంలోని మొదటి డ్యూప్లెక్స్ కు నెలవారీ అద్దె రూ.11.54 లక్షల చొప్పున, రెండో డూప్లెక్స్ ను నెలకు రూ.12.61 లక్షల అద్దెకు మూడేళ్లపాటు తీసుకున్నారు. రెండు లావాదేవీలు ఫిబ్రవరి 14న రిజిస్టర్ కాగా, వీటికి రూ.2.22 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.2వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.
This website uses cookies.