Categories: Celebrity Homes

మా ఇంటిని టచ్ చేస్తే అంతే ఇక..

  • రియల్ ఎస్టేట్ గురుతో అమాల్ మల్లిక్

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అమాల్ మల్లిక్.. చిన్నప్పుడు తాను నివసించిన మొట్టమొదటి ఇంటి గురించి తన జ్ఞాపకాలను ఎంతో ఆనందంగా ‘రియల్ ఎస్టేట్ గురు’తో పంచుకున్నారు. ఆయన పాటలు ఎంత వినసొంపుగా ఉంటాయో.. ఇంటి గురించి ఆయన చెప్పిన సంగతులు అంతకంటే మంత్రముగ్ధల్ని చేశాయి. తన చిన్ననాటి విశేషాల్ని ఆయన ఓ ప్రవాహంలా ఎంతో ఉత్సాహంతో చెబుతూనే ఉన్నారు.

‘చిన్నప్పుడు మా ఇంటిని ఎవరైనా ముట్టుకుంటే చాలా అసహ్యించుకునేవాడినని మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఇంటికి ఎవరైనా ఇంటీరియర్ డిజైనర్లు వస్తే నాకు అస్సలు నచ్చేదికాదు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇంటిని రెన్యువేట్ చేయడానికి ఒప్పుకునేవాడిని కాదు. పగిలిన చిన్న ఇటుక చూసినా, నా గుండె విలవిలాడిపోయేది. అప్పట్లో నేను చాలా బిగ్గరగా పాటలు పాడేవాడిని. మఖ్యంగా డర్ సినిమా పాటలు విపరీతంగా ఆలపించేవాడిని. అయితే, అలా ఎందుకు చేశానో ఇప్పటికీ నాకు తెలియదు. నా మొదటి ఇల్లు 90ల నాటి సంగీతంతో అలా ప్రతిధ్వనించింది’ అని అమాల్ వివరించారు. ‘మా అమ్మకు అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్ తెలివితేటలు అపారంగా ఉన్నాయి.

మా ప్రస్తుత ఇల్లు ఆమె ఆలోచనలకు ప్రతిబింబం. నాకు సంగీతం ఎలా చేయాలో ఒక్కటే తెలుసు. మిగిలిన అన్ని విషయాలనూ అమ్మకే వదిలేస్తాను. ఈరోజు వరకు కూడా దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఇది నాకు అస్సలు సరిపోదు’ అని అమాలు చెప్పారు. చాలాసార్లు ఆయన తన ఇంటి టైల్స్ మారడం లేదా గోడలు పడిపోవడం చూసి ఉండొచ్చు. కానీ ఆ మార్పులన్నీ ఆయన మునుపటి అంశాలను చెరిపివేసినట్టుగా భావించి ఉంటారని అనుకుంటున్నాం.

అమాల్ కొనసాగిస్తూ.. ‘అర్మాన్ ఇప్పుడే తన కలల ఇంటిని కొన్నాడు. అదే భవనంలో మాకు స్టూడియో ఉంది. అది మా స్థలం. మేమిద్దం కలిసి జామింగ్ చేస్తాం. ఇక మా అమ్మ దానిని కచ్చితంగా టేకోవర్ చేసి అద్భుతంగా డిజైన్ చేయబోతోందనే సంగతి మాకు తెలుసు’ అని తెలిపారు. తల్లి సరిగ్గా ఏమి నిర్మించాలనుకుంటన్నారో అది అమాల్ కు ఓకే.

పైగా మల్లిక్ కుటుంబానికి బడ్జెట్ లేదా ఇతర పరిమితులు కూడా ఏమీ లేవు. ‘కాసేపు ఎవరూ నన్ను రాని ప్రదేశానికి నన్ను పంపించండి. అప్పుడు నా అంతట నేను నిర్విషీకరణ చెందుతాను. పర్వతం వైపు విల్లా ఉత్తమంగా ఉంటుంది. ఇక నా ఫోన్ లో నెట్ వర్క్ ఉండకూడదు. అక్కడ ఎలాంటి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం ఇష్టం ఉండదు. మనమంతా పునరుజ్జీవం పొందాలనుకుంటున్నాం. అలాంటి జీవితం పొందడం కోసం చంపుతాను’ అని వ్యాఖ్యానించారు. ‘సహజంగానే నేను నా హోం స్టూడియోలో ఎక్కువ సమయం గడపడం మీరు చూస్తారు.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నా కుటుంబంతో సరదాగా గడుపుతాను. అక్కడంతా కూడా సినిమా సంగీతమే ఉంటుంది. ఆ గది నుంచి తప్పించుకోవడం అసాధ్యం. పైగా దాని గురించి ఎలాంటి ఫిర్యాదులూ లేవు. అదే నన్ను గాయకుడు-కంపోజర్ అమాల్ మల్లిక్ గా మార్చింది’ అని అమాల్ వివరించారు. తాను ప్రియాంకా చోప్రా ముంబై ప్యాడ్ ని సందర్శించానని.. అది చూడగానే మంత్రముగ్ధుడయ్యానని చెప్పారు. నిజంగా ఆమెకు డిజైనింగ్ నైపుణ్యాలు ఉన్నాయని ప్రశంసించారు.

This website uses cookies.