అటు ఆరోగ్యం.. ఇటు ఆనందం.. మరోవైపు వినోదం.. ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేయగలిగే చక్కని ప్రాజెక్టు కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అయితే, కూకట్ పల్లి హైదర్ నగర్ లోని వర్టెక్స్ ప్రిస్టీన్ ప్రాజెక్టును చూస్తే.. మీ అన్వేషణకు ముగింపు పడినట్లే! ఇక్కడ్నుంచి అటు హైటెక్ సిటీ కానీ ఇటు ఫార్మా సంస్థలకు కానీ సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. అలా నడుచుకుంటూ మెట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లిపోవచ్చు. విలాసవంతమైన, ఆరోగ్యకరమైన, వినోదభరితమైన జీవనాన్ని కోరుకునేవారికి ఈ ప్రాజెక్టు చక్కగా నప్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
హైదరాబాద్‌లో వర్టెక్స్ బ్రాండ్‌కు మంచి విలువ ఉంది. ఈ కంపెనీ ఆరంభించే ప్రాజెక్టులు ప్రతిఒక్కర్నీ తప్పకుండా ఆకర్షిస్తాయి. అందుకే, వీరి వద్ద ఒక్కసారి ఫ్లాట్ కొంటే చాలు.. ఆ బంధం అలాగే దృఢమవుతుంది. ప్రాజెక్టు ఫీచర్స్, ఎలివేషన్, అందులో పొందపరిచే ఎమినిటీస్, ల్యాండ్‌స్కేపింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ వర్టెక్స్ సంస్థ తన ప్రత్యేకతను చాటి చెబుతుంది. వర్టెక్స్ ప్రిస్టీన్ ప్రాజెక్టును సుమారు 3.9 ఎకరాల్లో నిర్మిస్తోంది. పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణాన్ని డిజైన్ చేసింది. ఇందులో వచ్చేవి మొత్తం ఐదు టవర్లు.. 2, 3 పడక గదుల ఫ్లాట్ల విస్తీర్ణం.. 1270 నుంచి 2030 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. పని, జీవితం, ఆటల మధ్య సంపూర్ణ సమతుల్యత అందించేలా అన్నీ చక్కగా తీర్చిదిద్దారు. ఇందులో ఇల్లు సొంతం చేసుకున్నవారు రోజు వారీ జీవితంలో తమకు అవసరమైన ప్రతిదాన్నీ వారి పరిధిలోనే అందుకునే వెసులుబాటు కల్పించారు. విశాలమైన ల్యాండ్ స్కేపింగ్‌తో పాటు సెంట్రల్ పార్కు చూపరులను కట్టిపడేస్తాయి. ఆకట్టుకునే ప్రకృతి దృశ్యాలు, ఆటస్థలాలు దీనికి అదనపు ఆకర్షణ.
లొకేషన్ పరంగా చూస్తే ఈ ప్రాజెక్టు అత్యంత అనుకూల, కనెక్టివిటీ కలిగిన ప్రాంతంలో ఉండటం విశేషం. కూకట్ పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ కి కేవలం 0.8 కిలోమీటర్ల ఉంది. ఇక్కడ్నుంచి నారాయణ కాన్సెప్ట్ స్కూల్ కేవలం కిలోమీటరు దూరమే. సంఘమిత్ర స్కూల్ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో, జేఎన్టీయూ 2 కిలోమీటర్ల దూరంలో, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వికాస్ కాన్సెప్ట్ స్కూల్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ్నుంచి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎంతలేదన్నా పది కిలోమీటర్లు ఉంటుంది.
వర్టెక్స్ ప్రిస్టీన్ నుంచి అత్యవసరాల్లో ఆస్పత్రులకు సులువుగా వెళ్లొచ్చు. కేవలం కిలోమీటర్ దూరంలోనే హోలిస్టిక్ హాస్పటల్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ హాస్పటల్ 2 కిలోమీటర్లు, పల్స్ హార్ట్ సెంటర్, రెయిన్ బౌ చిల్డ్రన్స్ హాస్పటల్ రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇందులో ఉండేవారు.. షాపింగ్ చేయాలన్నా.. సినిమాల్ని వీక్షించాలన్నా సులువే. నడుచుకుంటూ చుట్టుపక్కల షాపింగ్ చేసేయవచ్చు. కూతవేటు దూరంలోనే జీపీఆర్ మల్టీప్లెక్స్ ఉంది. ఓ మూడు కిలోమీటర్ల దూరంలో మంజీరా మాల్, నాలుగు కిలోమీటర్లలో ఫోరం మాల్ వంటివి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కూకట్ పల్లి మెయిన్ రోడ్డుకి అత్యంత సమీపంలో ఉండటం వల్ల కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది.
అత్యున్నత ప్రమాణాలు, నాణ్యతతో అందంగా రూపుదిద్దుకుంటున్న వెర్టెక్స్ ప్రిస్టైన్ లో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంట్రన్స్, ఎగ్జిట్ గేట్లు, జాగింగ్ ట్రాక్, లాన్, వీడీఎఫ్ డ్రైవ్ వే, సీటింగ్ డెక్, పిల్లల ఆటస్థలం, ఫైర్ డ్రైవ్ వే, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, క్రికెట్ పిచ్, ఫిట్ నెస్ స్టేషన్, యాంఫీ థియేటర్ విత్ స్టేజ్, స్టెప్పింగ్ స్టోన్, సీసీ కెర్బింగ్ విత్ స్వాల్, ప్లాంటర్ బాక్స్, ర్యాంప్, ఫైర్ డ్రైవ్ వే ఎంట్రన్స్ పేవింగ్, బ్యాడ్మింటన్ కోర్టులు, కాఫీ డెక్, యోగా డెక్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇక 15 వేల చదరపు అడుగుల్లో అదిరిపోయే రేంజ్ లో క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. రూఫ్ టాప్ పూల్ దీని ప్రత్యేకత. జిమ్, స్పా, క్రెష్ వంటివి ఎన్నో ఉన్నాయి. వర్టెక్స్ ప్రిస్టీన్లో ప్లాట్ తీసుకుంటే మీకు ఓ చిరునామా ఒక్కటే కాదు.. అంతుకు మించి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే హైదర్ నగర్ వెళ్లి వర్టెక్స్ ప్రిస్టీన్ని ఒక లుక్కేసి రండి.
This website uses cookies.