Categories: LEGAL

యూనిటెక్ మాజీ ప్రమోటర్ల అరెస్ట్

మనీ ల్యాండరింగ్ కేసులో యూనిటెక్ రియాల్టీ గ్రూప్ మాజీ ప్రమోటర్లు, సోదరులు సంజయ్ చంద్ర, అజయ్ చంద్రలను ఎన్ ఫోర్స్ మెంట డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ముంబైలో వారిద్దరినీ అరెస్టు చేసి ఢిల్లీ తీసుకొచ్చి వేర్వేరు జైళ్లకు తరలించామని వెల్లడించింది. మనీ ల్యాండరింగ్ కేసులో తమకు కొత్త ఆధారాలు అందినందును ఇద్దరినీ మరోసారి విచారించేందుకు అనుమతించాలంటూ ఈడీ చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇద్దరినీ అరెస్టు చేసి ఢిల్లీ తీసుకొచ్చింది. తాజాగా వారిని విచారించేందుకు వీలుగా కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సోదరులిద్దరూ తీహార్ జైలులో ఉన్నప్పుడు జైలు సిబ్బందితో కుమ్మక్కై అక్కడ నుంచి తమ వ్యాపార కార్యకలాపాలు సాగించారని గతంతో సుప్రీంకోర్టుకు ఈడీ నివేదించింది. ఇళ్ల కొనుగోలుదారుల డబ్బును దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సంజయ్, అజయ్ లు 2017 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. దాదాపు రూ.2వేల కోట్లను అక్రమంగా మళ్లించారని ఈడీ వారిపై కేసు నమోదు చేసింది.

This website uses cookies.