Categories: LATEST UPDATES

మళ్లీ కోకాపేట భూముల వేలం

హైదరాబాద్ కోకాపేట నెపోలిస్ ప్రాంతంలోని 239, 240 సర్వే నంబర్లలో ఉన్న భూముల వేలానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వీటికి సంబంధించి సేల్ డీడ్లను జారీ చేసే అధికారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అప్పగించారు. ఆ భూములపై సర్వ హక్కులూ ప్రభుత్వానికి ఉన్నాయని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ) ప్రభుత్వ ఏజెంటుగా ఆ భూములను వేలం వేయనుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హెచ్ఎండీఏ దీనికి సంబంధించిన అన్ని కార్యకలాపాలూ నిర్వహిస్తుందని స్పష్టంచేశారు. కాగా, ఈ భూముల అమ్మకం ద్వారా దాదాపు రూ.5వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు కోకాపేటలోని భూముల అమ్మకం ద్వారా హెచ్ఎండీఏ రూ.2వేల కోట్ల ఆదాయం సంపాదించింది. గతంలో జూలైలో నిర్వహించిన వేలానికి అద్బుతమైన స్పందన వచ్చింది. ఎకరా స్థలం ఏకంగా రూ.60.2 కోట్లు పలికింది. రాజపుష్ప రియాల్టీ సంస్థ 1.65 ఎకరాల స్థలాన్ని రూ.99.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

This website uses cookies.