నటుడు రాజ్ కుమార్ రావు తన భార్య, నటి పాత్రలేఖతో కలిసి ముంబైలోని ఓ ఖరీదైన ఇంట్లో ఉంటున్నారు. వారి ఇల్లు ఎంతో కళాత్మకంగా ఉండటమే కాదు.. రాజ్ కుమార్ రావు వ్యక్తిత్వాన్ని సముచితంగా ప్రతిబింబించేలా కనిపిస్తుంది. ఆయన ఇటీవల నటి జాన్వీ కపూర్ కు చెందిన విలాసవంతమైన ట్రిపులెక్స్ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇల్లు ఆధునికమైన, ఇంకా రాయల్ లుక్ ని అందించే అంశాలతో మిళితమై ఉంటుంది. పలు టెక్స్చర్లు, ఆకర్షణీయమైన రంగుల వాడకంతో ఇంటీరియర్ డెకర్ అదిరిపోయేలా కనిపిస్తుంది.
- నిజానికి రాజ్ కుమార్ రావు కొత్తకొత్త పాత్రలు, పాత్రలతో ప్రయోగాలు చేయడానికి బాగా ఇష్టపడతారు. ఈ లక్షణమే ఆయన ఇంటీరియర్ డెకర్ థీమ్ ఎంపికలో బాగా ప్రతిబింబిస్తుంది. ఎర్ర ఇటుక టోన్ లో సున్నితమైన రంగులు, చెక్క ఫ్లోరింగ్ తో కూడిన హాయి గొలిపే లివింగ్ రూమ్ మదిని ఆకట్టుకుంటుంది. ఆ గదిలో ఓ మూలన బుద్ధుని రాతి శిల్పం కనువిందు చేస్తుంది. ఆ పక్కనే వెదురు మొక్క ఆ మొత్తం గదికే వన్నె తెచ్చింది. ఓ వైపు లేత గోధుమరంగు క్లిక్ సోఫా సెట్.. ఇంకా కార్పెట్ పై చెక్క, గ్లాస్ సెంటర్ టేబుల్ ఆ గదిని ఆకర్షణీయంగానూ, ఆధునికంగానూ కనిపించేలా చేశాయి.
ఇక రాజ్ కుమార్ రావు ఇంట్లో ఓ గదికి కిటికీ సమీపంలో రీడింగ్ కార్నర్ ఉంది. ఈ ప్రాంతం లేత గోధుమ రంగు, ఎరుపు రంగు అప్హోల్స్టరీతో అలంకరించారు. నవ్వు పుట్టించే కళాఖండాలతోపాటు తలుపులు, గోడలపై చక్కని కోట్ లు ఆకట్టుకుంటాయి. రాజ్ కుమార్ రావుకు ముంబైలో ఇది నాలుగో ఇల్లు. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన రాజ్ కుమార్.. గుర్గవ్ లో 16 మంది సభ్యులతో నివసించారు. ముంబై వచ్చిన తర్వాత మరో ఇద్దరితో కలిసి ఫ్లాట్ లో ఉన్నారు. అనంతరం మరో ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే తన మొదటి సినిమా ఆఫర్ అందుకోవడమే కాకుండా దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఆ ఇంటితో రాజ్ కుమార్ కు చక్కని అనుబంధం ఏర్పడింది. ఇక ప్రస్తుతం రాజ్ కుమార్ ఇంట్లో డైనింగ్ స్పేస్ పక్కనే లివింగ్ ఏరియా ఉంది. అక్కడ చెక్క కుర్చీలతోపాటు ఓ చిన్న టేబుల్ ఉంటుంది. ఓ గోడపై ఆకర్షణీయమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక బెడ్ రూమ్ లో సరైన మిశ్రమంలో ఉన్న రంగులు మదిని పులకరింపజేస్తాయి. పేటర్న్ డిజైన్ తో లేత నీలం రంగులో ఉన్న వాల్ పేపర్ చూపు తిప్పుకోనీయదు. ఆ గదిలో నాలుగు తెల్లని స్తంభాలు, మూలలో ఉన్న సైడ్ టేబుల్స్, వాటిపై టేబుల్ ల్యాంపు.. ఆ గదికి క్లాసిక్ టచ్ తీసుకొచ్చాయి.