Categories: LATEST UPDATES

ఫర్నిచర్ మార్కెట్ దూకుడు

  • 2028 నాటికి 33.58 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం
  • మోర్డోర్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో వెల్లడి

కలపతో రూపొందించే ఫర్నిచర్ ఉత్పత్తి చేయడానికి భారతదేశం ఎంతో ప్రసిద్ధి చెందింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోళ్లు, దేశంలోని స్టైలిష్ ఇంటీరియర్స్ కోసం ఇళ్ల యజమానుల ఆకాంక్షలు వెరసి ఫర్నిచర్ డిమాండ్ ను అంతకంతకూ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 20.96 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫర్నిచర్ మార్కెట్ 2028 నాటికి 33.58 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ఇండియా హోమ్ ఫర్నిచర్ మార్కెట్ రిపోర్ట్ పేరుతో మోర్డోర్ ఇంటెలిజెన్స్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. మధ్యతరగతి ప్రజల తలసరి ఆదాయం పెరగడం, స్థానిక పంపిణీ టై అప్ లు, స్టాంట్ ఎలోన్ స్టోర్లు, ఫర్నిచర్ బ్రాండ్ల ఆన్ లైన్ అమ్మకాలు కలిసి మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో గోద్రేజ్ ఇంటీరియో, జువారీ ఫర్నిచర్, దురియన్ ఫర్నిచర్, డామ్రో ఫర్నిచర్, నీల్ కమల్ ఫర్నిచర్, ఐకియా, యాష్లే ఫర్నిచర్ ఇండస్ట్రీస్ ఇంక్, ఉషా లెక్సస్ ఫర్నిచర్, ఎవోక్, హల్స్టా, పెప్పర్ ఫ్రై, అర్బన్ ల్యాడర్ వంటి కంపెనీలు కీలకంగా ఉన్నాయి. దేశంలో జనాభా పెరుగుదల, అందుబాటు గృహాలకు డిమాండ్ కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పెరుగుతోంది. ప్రధాన నగరాల్లో విల్లాలు, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ బాగా ఉంది. ఈ నేపథ్యంలో సోఫా సెట్లు, డైనింగ్ సెట్లు, బెడ్ లు, కుర్చీలు సహా ఫర్నిచర్ అవసరాన్ని ఇవన్నీ పెంచుతున్నాయి. దీంతో ఫర్నిచర్ మార్కెట్ బాగా పెరుగుతోంది.

This website uses cookies.