తెలంగాణ ప్రభుత్వం వేలం ప్రక్రియ జిల్లాలకు చేరింది. ఎనిమిది జిల్లాల పరిధిలో ఎలాంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను ఖరీదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎనిమిది జిల్లాల పరిధిలో వివిధ సైజుల్లో ఉన్న దాదాపు 1,092 ఓపెన్ ప్లాట్లను పారదర్శకంగా భౌతిక వేలం ప్రక్రియలో వేలం వేస్తారు. మహబూబ్నగర్, నల్లగొండ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, కె.బి.ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు ప్రిబిడ్ సమావేశాలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న ఓపెన్ ప్లాట్ల సంఖ్యను బట్టి మార్చి నెలలో 14 నుంచి 17వ తేదీ వరకు భౌతిక పద్దతిలో వేలం నిర్వహిస్తారు.
This website uses cookies.