కాలుష్యమయ జీవితానికి దూరంగా, నగరానికి దగ్గర్లో అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లుంటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తున్నారా? మీలాంటి వారి కోసమే గ్రీన్ స్టోన్ డెవలపర్స్ ఓ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. శంషాబాద్ తుక్కుగూడలో ప్రకృతి ఓడిలో కదంబ ఫారెస్టు పేరుతో ఉబెర్ లగ్జీరియస్ 2, 3 బీహెచ్ కే స్పేసియస్ అపార్ట్ మెంట్లు నిర్మిస్తోంది. దాదాపు 18 వేల ఎకరాల మహేశ్వరం అడవి సమీపంలో 3.15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
కరోనాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కామన్ ఏరియాల్లో సోలార్ పవర్‌తో పాటు స్థిరమైన విద్యుత్ సరఫరా, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ ప్యానెల్, జీరో వాటర్ వేస్టేజ్ వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. గ్రీన్ ప్రాజెక్టుగా గోద్రేజ్ సర్టిఫికెట్ కూడా ఉంది. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడానికి వీలుగా విశాలమైన పచ్చని ప్రదేశాలతో ఈ అపార్టుమెంట్లు వస్తున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలంతో పాటు పెద్దలంతా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి రచ్చబండ తరహా ఏర్పాటు కూడా ఉంది. పిల్లలు, పెద్దల అవసరాలకు అనుగుణంగా బోలెడు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతటా పచ్చదనం ఉండటం వల్ల అటు పిల్లలు, ఇటు పెద్దలు కూడా చక్కని జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒక్క వాస్తు మాత్రమే కాకుండా వృక్షశాస్త్ర, జీవావరణ శాస్త్ర, సుస్థిరత రంగాల నిపుణులందరూ కలిసి ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. వంద టన్నుల స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేసే ఆకులు, పొదలు, చెట్లు, తీగలతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది.
This website uses cookies.