ప్రాజెక్టు సైట్లలో కాలుష్య నివారణకు సంబంధించిన చర్యలు తీసుకోవడానికి 30 రోజుల సమయం సరిపోదని, ఇందుకు మరికొంత సమయం కావాలని పలువురు బిల్డర్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ని కోరారు. ప్రాజెక్టు సైట్లలో 35 అడుగుల మెటల్ షీట్లను ఏర్పాటు చేయడంతోపాటు స్ర్పింక్లర్లు, ఏంటీ స్మోక్ గన్స్, గాలి నాణ్యత పెంపొందించే చర్యలు తీసుకోవడానికి 30 రోజుల సమయం సరిపోదని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పలువురు బిల్డర్లు టీ వార్డ్ ఆఫీసర్ ను కలిసి సమయం పెంచాలని కోరారు. గత కొన్ని నెలలుగా ముంబైలో కాలుష్యం పెరిగిపోయింది.
ఫలితంగా గాలి నాణ్యత బాగా దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణ చర్యలకు సంబంధించి పలు మార్గదర్శకాలను బీఎంసీ గతనెల 25న విడుదల చేసి, బిల్డర్లక 30 రోజుల సమయం ఇచ్చింది. అయితే, నిర్దేశిత సమయంలో ఆ పరికరాల ఏర్పాటు సాధ్యం కాదని, అందువల్ల ఈ విషయంలో సడలింపు ఇచ్చి, సమయం పెంచాలని బిల్డర్లు కోరారు. దీనిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
This website uses cookies.