Categories: TOP STORIES

పనులు నిలిపేయాలని ప్రెస్టీజ్ గ్రూప్ కు నోటీసు

ముంబైలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు నిర్మాణ సైట్ల వద్ద పాటించాల్సిన చర్యలు ఉల్లఘించిందనే కారణంతో ప్రెస్టీజ్ గ్రూప్ పై బీఎంసీ కన్నెర్రచేసింది. వెంటనే సదరు ప్రాజెక్టు పనులన్నీ నిలిపివేయాలని ఆ సంస్థకు నోటీసు జారీ చేసింది. ములుంద్ వెస్ట్ లో ‘ప్రెస్టీజ్ సిటీ’ ప్రాజెక్టులో సియస్టా, బెల్లంజా, సీఓసీ పేరుతో నిర్మిస్తున్న భవనాల నిర్మాణ స్థలాన్ని వాయు కాలుష్య నివారణ బృందం సందర్శించింది.

అక్కడ కాలుష్య నిరోధక మార్గదర్శకాలు సరిగా పాటించడంలేదని అంశాన్ని ఆ బృందం గుర్తించింది. తగినన్ని స్ప్రింకర్లు, స్మాగ్ గన్స్ ఏర్పాటు చేయాలని సూచించినా మీరు ఆ పని చేయలేదు. అందువల్ల వెంటనే ప్రాజెక్టు పనులు నిలిపివేయాలి’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ప్రెస్టీజ్ సంస్థ స్పందించింది. ‘కాలుష్య నిరోధక మార్గదర్శకాలను పాటించేందుకు తగిన చర్యలను వెంటనే ప్రారంభించాం. ఇప్పటికే రెండు స్మోగ్ గన్స్ ఏర్పాటు చేశాం’ అని ఓ ప్రటకనలో వెల్లడించింది.

This website uses cookies.