Categories: PROJECT ANALYSIS

జనప్రియ నైల్ వ్యాలీ.. లైఫంతా జాలీ

  • చందానగర్ లో కొత్త ప్రాజెక్టు లాంచ్
  • వివిధ పరిమాణాల్లో 2, 3 బీహెచ్ కే

జీవితమంతా జాలీగా గడపాలని అనుకుంటున్నారా? ఆఫీసు దగ్గర నుంచి నిత్య జీవితంలో అవసరమైన అన్నింటికీ దగ్గరగా ఉండాలని అనుకుటున్నారా? అయితే, చందానగర్ లో జనప్రియ లాంచ్ చేసిన నైల్ వ్యాలీ ప్రాజెక్టు మీ అన్వేషణకు ముగింపు పలుకుతుంది.

మీ జీవనశైలిని పునర్ నిర్వచించడానికి వీలుగా నిర్మిస్తున్న ఓ ఖరీదైన ప్రాజెక్టు ఇది. ప్రతి కుటుంబం తాము కోరుకుంటున్నట్టుగా అత్యుత్తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కలిగి ఉడాలని కోరుకుంటుంది. అలాంటి కలలు ఇక్కడ కచ్చితంగా నెరవేరతాయి. మీ ఆఫీసులకు, ఇతరత్రా దైనందిన అవసరాలకు, వినోద కార్యకలాపాలకు వెళ్లడానికి గంటల తరబడి సమయం వెచ్చించాల్సిన పని లేదు. ముఖ్యమైనవన్నీ కేవలం 15 నిమిషాల దూరంలోనే ఉన్నందున ప్రతిరోజూ మీకు బోలెడు సమయం ఆదా అవుతుంది.

దానిని మీ ప్రియమైనవారితో ఆస్వాదించడానికి వీలవుతుంది. పైగా నైల్ వ్యాలీలో అడుగు పెడితే చాలు.. ఇక జీవితాంతం అక్కడే ఉండాలనే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇది కేవలం నివాసం మాత్రమే కాదు.. మీ మధుర స్మృతులను పెంపొందించుకునే అద్భుత ప్రదేశం. పైగా మీ అవసరానికి తగ్గట్టుగా వివిధ సైజుల్లో ప్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. 1080 చదరపు అడుగుల నుంచి 1250 చదరపు అడుగుల వరకు 2 బీహెచ్ కే, 1475 చదరపు అడుగుల నంచి 1580 చదరపు అడుగుల వరకు 3 బీహెచ్ కే ఉన్నాయి.

హెల్త్ అండ్ ఫిట్ నెస్..

ప్రస్తుత జీవనశైలికి ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటం చాలా అవసరం ఇందుకోసం నైల్ వ్యాలీలో అన్ని రకాల సౌకర్యాలూ ఏర్పాటు చేస్తున్నారు. 20 మీటర్ల స్విమింగ్ పూల్, జిమ్నాజియం, సైక్లింగ్ స్టూడియో, బ్యాడ్మింటన్, ఏరోబిక్స్, యోగా, ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, కారమ్స్, బిలియర్డ్స్, బాంకెట్ హాల్, ఆర్టిఫిషియల్ టర్ష్ క్రికెట్ అరేనా, ఆర్టిఫిషియల్ గ్రాస్ మల్టీ స్పోర్ట్స్ ఫెసిలిటీ వంటివి ఉన్నాయి.

అద్భుతమైన కనెక్టివిటీ..

నైల్ వ్యాలీ వాసులు గంటలపాటు ట్రాఫిక్ లో వేచి చూడాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి అన్నీ చాలా దగ్గరగానే ఉన్నాయి. చందానగర్ బస్ స్టేషన్ కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే చందానగర్ ఎంఎంటీఎస్ స్టేషన్ 10 నిమిషాల దూరంలో, మియాపూర్ మెట్రో స్టేషన్ 10 నిమిషాల దూరంలో ఉన్నాయి. ఇక కిమ్స్ ఆస్పత్రికి 10 నిమిషాల్లో, ఏఐజీ హాస్పటల్, ఎస్ఎల్జీ ఆస్పత్రికి 12 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఢిల్లీ పబ్లిక స్కూల్ కి 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. జనప్రియ స్కూల్ కి 10 నిమిషాలు, జేఎన్టీయూకి 12 నిమిషాల సమయం పడుతుంది.

కార్పొరేట్ సంస్థల్లో ఐబీఎం 10 నిమిషాల దూరంలో ఉండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కి 10 నిమిషాల్లో, హైటెక్ సిటీకి 12 నిమిషాల్లో, బీహెచ్ఈఎల్ కి 15 నిమిషాల్లో వెళ్లొచ్చు. షాపింగ్ మాల్స్ సైతం దగ్గర్లోనే ఉన్నాయి. చెన్నై షాపింగ్ మాల్ 5 నిమిషాల దూరంలో ఉండగా.. సెంట్రల్, ఐనాక్స్ లు 7 నిమిషాల దూరంలో ఉన్నాయి. ఐకియాకు 15 నిమిషాల్లో వెళ్లొచ్చు. ఇనార్బిట్ మాల్ 16 నిమిషాల దూరంలో ఉంది. కనెక్టివిటీని పక్కన పెడితే విందు వినోద కార్యకలాపాల కోసం 45వేల చదరపు అడుగుల్లో అదిరిపోయే రీతిలో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు. పార్క్, ఓపెన్ ఏరియాతోపాలు పిల్లలు ఆడుకోవడానికి సకల సదుపాయాలూ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే నైల్ వ్యాలీలో జీవితం జాలీగా గడపడానికి ఈ రోజే బయలుదేరండి.

This website uses cookies.