A Buyer filed case against Gauri Khan, Wife of Shahrukh Khan
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై లక్నో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫ్లాట్ అప్పగింతకు సంబంధించిన వ్యవహారంలో గౌరీతోపాటు తుల్సియానీ గ్రూప్ ఎండీ అనిల్ తుల్సియానీ, డైరెక్టర్ మహేశ్ తుల్సియానీలపై ముంబైకి చెందిన కిరీట్ జశ్వంత్ షా ఫిర్యాదు మేరకు లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 2015లో తుల్సియానీ కన్ స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఆఫీసును సందర్శించి వారి ప్రాజెక్టులో ఓ ఫ్లాట్ ను రూ.86 లక్షలకు కొనుగోలు చేశానని షా తెలిపారు ఒప్పందం ప్రకారం 2016లో తనకు ఫ్లాట్ అప్పగించాల్సి ఉందన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా తనకు ఫ్లాట్ అప్పగించలేదని.. దీనిపై విచారణ చేస్తే తన ఫ్లాట్ ను కంపెనీ మరొకరికి విక్రయించిన సంగతి తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఒప్పందం చేసుకున్న సమయంలో తుల్సియానీ కన్ స్ట్రక్షన్ కంపెనీకి గౌరీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఫిర్యాదు చేస్తున్నట్టు వెల్లడించారు.
This website uses cookies.