‘నా నేపథ్యం దృష్ట్యా నేను పాతకాలపు విద్యార్థిని. నా ఇంట్లో సమయంతో సంబంధం లేని సేకరణకే ప్రాధాన్యం ఇస్తాను. ఎలాంటి సంప్రదాయ డిజైన్ అయినా నాకు నచ్చుతుంది’ అని వివరించారు. తన లివింగ్ రూమ్ సహజసిద్ధంగా ప్రకృతితో మమేకమయ్యేలా ఉండాలని తన ఇంటీరియర్ డిజైనర్ కు స్పష్టం చేశారు. ‘బయటి ప్రకృతిని లోపలకు తీసుకురావాలనేది నా ఆలోచన. అది అక్కడ వెచ్చదనాన్ని, తాజాదనాన్ని అందిస్తుంది..
అంతేకాకుండా అందమైన సముద్రపు నీటిపై సూర్యకిరణాలు పడి మెరుస్తుండటం కనువిందు చేస్తాయి. అలాగే కిటికీల నుంచి ప్రవహించే చల్లని గాలి మనల్ని మేల్కొలపడం భలే మజాగా ఉంటుంది. ఇవన్నీ నాకు విలాసవంతంగా అనిపిస్తాయి. నా నగరం అందమైన సముద్ర కిరీటం కలిగి ఉంది. నేను ఆ విలాసవంతమైన ప్రదేశంలో ఇంటి కోసం చూస్తున్నాను. కనులు చెదిరే వీక్షణ అనుభూతిని సొంతం చేసుకునేందుకు ఇదే సరైన ప్రదేశమని భావించాను’ అని ఇషాన్ తెలిపారు.
ఇషాన్ తన ఇంటికి కఠినమైన పాలిష్ అనుభూతిని కోరుకోలేదు. దానికి బదులుగా సహజసిద్ధ సౌందర్యం ఉట్టిపడాలని భావించారు. ‘మట్టి కుండలలో సహజ సౌందర్యం మనలో అందమైన ప్రకంపనలు కలిగిస్తుంది. న్యూట్రల్స్, ఎర్త్ టోన్లు ఆ స్థలానికి సహజమైన సౌందర్యాన్ని ఇస్తాయి. ఇంటి విషయంలో అటు గ్లామర్ ను ఇటు ప్రకృతిని సమతుల్యం చేయడమే నా లక్ష్యం’ అని స్పష్టంచేశారు. ఇక ఆయన చూపించిన ఫర్నిచర్ మొత్తం మొదటి చూపులోనే నచ్చినవని తెలిపారు. ‘నా ఇంటి రూపాన్ని, అనుభూతిని మార్చగల సత్తా ఉన్న అద్భుత కళాఖండాలను జాగ్రత్తగా ఎంచుకున్నాను. దశాబ్దాల పాటు అవి ఆనందాన్ని ఇస్తాయి..
కళాకృతులు అనేవి ఇంటికి అందాన్ని ఇస్తాయనే అంశాన్ని నేను బలంగా విశ్వసిస్తాను. అయితే, దానిని ఎక్కడ ప్రారంభించాలి అనేది తెలుసుకోవడం చాలా సవాల్ తో కూడుకున్న వ్యవహారం. అయితే, నేను దానిని ఉత్తమంగా ఎలా చేయాలనేదానిపై వృత్తిపరమైన సలహాలు తీసుకున్నాను. నా కొత్త ఇంట్లో కళ ఎలా ఎంచుకోవాలో ఆలోచించడంలో ఆమె నాకు చాలా సాయం చేశారు’ అని తెలిపారు.
సహజంగానే ఓ నటుడికి మీడియా రూం ఆవశ్యకత ఉంటుంది. ఇషాన్ కూడా దానిని కోరుకున్నారు. ‘క్యారెక్టర్.. నాకు మీడియా కన్సోల్ పై చాలా ఆసక్తి ఉంది. ఇక్కడ కూడా నా ఇంటీరియర్ డిజైనర్ అద్భుతమైన పాత్ర పోషించి దీనిని అందంగా తీర్చిదిద్దారు. ఇది నా వ్యక్తిగత శైలిని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఇంకా దీనికి అదిరిపోయే వాతావరణాన్ని జోడించడానికి విభిన్న రకాల టెక్చర్లను వినియోగించాం’ అని చెప్పి ముగించారు.
This website uses cookies.