Categories: LATEST UPDATES

ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నారైలకు ఇక్కట్లు

  • ప్రాపర్టీ అమ్మకాలు, కొనుగోళ్లకు ఆధార్ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ లో ప్రాపర్టీ అమ్మకాలు, కొనుగోళ్లకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. దీంతో పలువురు ఎన్నారైలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. విశాఖలో ఉన్న తన ప్రాపర్టీ అమ్మకం కోసం విశాఖ వచ్చారు. తీరా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లాక వారు ఆధార్ కార్డు అడిగారు. అది లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయలేదు. తాను ఎన్నారైనని, తనకు గ్రీన్ కార్డు కూడా ఉందని, ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయ్యాయనని.. ప్రాపర్టీ అమ్మకానికి సంబంధించి అన్ని రకాల పత్రాలూ ఉన్నప్పటికీ, కేవలం ఆధార్ కార్డు లేదనే కారణంతో రిజిస్ట్రేషన్ నిరాకరించారని ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి ఆధార్ కార్డును అన్నింటికీ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. ఏపీలో అమలు కావడంలేదు. దీనిపై సదరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వివరణ కోరగా.. ఆధార్ కార్డు లేకుండా రిజిస్ట్రేషన్ చేయొద్దని తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో బయో మెట్రిక్ వ్యవస్థ సరిగా పనిచేయడంలేదని.. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు చెబుతున్నారు.

This website uses cookies.