కొత్త వైబ్స్ కలిగిన ఇంటిని బాలీవుడ్ నటుడు అపర్‌శక్తి ఖురానా నిర్మించుకున్నారు. ఇతను హిందీ యాక్టర్ ఆకాశ్ ఖురానాకు స్వయానా సోదరుడు. వాస్తవిక డిజైనింగ్ ఫిలాసఫీని అనుసరించి.. ఇంట్లో సామరస్య రూపాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ గృహాన్ని ప్రఖ్యాత సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ రూపిన్ సుచక్ రూపొందించారు. ఇద్దరు కలిసి దీర్ఘంగా చర్చించుకుని.. ఇంటికి సంబంధించిన డెకరేషన్‌ను ఎంచుకున్నారు. ఫలితంగా, అపర్‌శక్తి ఖురానా కుటుంబానికిది ఎంతగానో నచ్చడం విశేషం.
“ఈ ఇంటికి ప్రేరణ ఏమిటో తెలుసా? ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని, కాస్త ఆధునికంగా.. కొంత పిచ్చిపిచ్చిగా ఉండాలని అనుకున్నాను. ఇల్లు కాస్త నాటకీయంగా, వెచ్చగా, ప్రతిఒక్కరికీ నచ్చేలా ఉండాలని భావించాను. పాతతరపు భారతీయ ఆర్కిటెక్చర్‌ను దృష్టిలో పెట్టుకుని సీలింగ్ ఉండాలని అనుకున్నాను. మరోవైపు బాలినీస్ తరహా డెకొరేషన్ ఉండాలని ఆశించాను. మొత్తానికి ఇల్లు చూస్తే కళాత్మకంగా కనిపించే సౌందర్య స్వర్గంగా ఉంటుంది.”
ఇంటిని మరింత ఉల్లాసంగా ఉండాలని భావించి.. మూలలు హాయింగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ముంబైలో ఒక స్థలం దొరకడమెంత కష్టమో ప్రతిఒక్కరికీ తెలిసిందే. మేం తీసుకున్న అపార్టుమెంట్‌లో అప్పటికే చక్కటి ప్రణాళిక కలిగిన లేఅవుట్ ఉంది. అది మా అదృష్టమని చెప్పాలి. ఫలితంగా, స్థలాన్ని హాయిగా కనిపించేలా తీర్చిదిద్దడంతో పాటు విశ్రాంతి తీసుకునేలా మలుచుకున్నాం. అనుకున్నంత స్థలం ఉండటం వల్ల లివింగ్ రూముని డైనింగ్ ఏరియాతో కలిపేశాం. ఇది మా అందరికీ నచ్చింది. “ఇంటి కోసం అన్వేషించిన మరియు రూపొందించిన ప్రతి స్థలంలో కొంత భాగంలో నేను ఉంటాను. ఇల్లు వైవిధ్యంగా కనిపించేందుకు కొన్ని కీలక అంశాల్ని జోడించాను. డిజైనింగ్ లో నా శైలి స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ప్రతి స్థలంలో ఎల్లప్పుడూ అద్భుతమైన ఎలిమెంట్‌ను జోడిస్తాను. అయితే, నా సౌందర్యంలో స్థిరత్వం ఉంటుంది. నా పనిలో నా వ్యక్తితత్వం కనిపిస్తుందని వివరించారు.
అర్బన్ హై-రెజ్‌ల యొక్క అన్ని ఇతర గృహాల మాదిరిగానే, సరిగ్గా మూడు నెలల్లో డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే, ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం అతిపెద్ద సవాలుగా పరిగణించాం. ప్రొడక్షన్ డిజైన్ నుంచి ఇంటీరియర్‌ల వరకూ సమయానికి అనుగుణంగా పని చేయడం ఒక సవాలుగానే భావంచి పని చేశామని ఇంటీరియర్ డిజైనర్ తెలిపారు. మొత్తానికి, ఇద్దరు కలిసి కాస్త భిన్నంగా కనిపించే అందమైన గృహాన్ని తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. అపర్‌శక్తి కూడా ప్రతి అంశంలోనూ స్పష్టత ఉన్న వ్యక్తి. అందుకే, తను కోరుకున్న విధంగా ఇంటిని డిజైన్ చేయగలిగారు. మొత్తం పూర్తయ్యాక ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే.. ఎంతో హాయిగా, అందంగా కనిపిస్తుంది.
This website uses cookies.