ఏపీ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ప్రభుత్వం కొత్త జోన్ సృష్టించింది. ఇందుకోసం దాదాపు 900 ఎకరాలు కేటాయించింది. మాస్టర్ ప్లాన్ లో చేసిన మార్పులకు సంబంధించి స్థానికుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు ఈనెల 11 వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వాస్తవానికి ఇప్పటికే దీనికి సంబంధించి చేసిన మార్పులను సీఆర్డీఏ ఆమోదించింది. సీఆర్డీఏ చట్టానికి చేసిన సవరణలపై గవర్నర్ ఆమోదం కూడా పొందింది. కాగా, గతంలో రాజధాని అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు భూములు ఇవ్వాలని చేసిన ప్రయత్నాలకు స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ పూలింగ్ పథకం కింది తాము ఇచ్చిన భూములను రాజధాని ప్రాంతానికి సంబంధించని వ్యక్తులకు కేటాయించడం సబబు కాదని వాదించారు. రాజధాని ప్రాంతానికి స్థానికేతరులను తీసుకురావడం.. స్థానికుల గళాన్ని అణచివేయడానికేనని అనుమానం వ్యక్తం చేశారు.
This website uses cookies.