జీవో 111 ఎత్తివేత పుణ్యమా అంటూ.. హైదరాబాద్ రియల్ రంగంలో భూముల లావాదేవీలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటివరకూ పోటీ పడి భూములు కొన్నవారంతా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. పెట్టుబడి నిమిత్తం ప్లాట్లు కొన్నవారు అమ్ముకోలేకపోతున్నారు. అంతెందుకు, ఇదివరకే పలువురు బిల్డర్ల వల్ల విల్లాలకు అడ్వాన్సులు ఇచ్చినవారూ వెనకడుగు వేస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లో ఫ్లాట్లు కొనాలని భావించేవారు వేచి చూసే ధోరణీని అలవర్చుకున్నారు. మొత్తానికి, ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వల్ల ఒక్కసారిగా హైదరాబాద్ రియాల్టీ త్రిశంకు స్వర్గంలో కొట్టి మిట్టాడుతోంది.
ట్రిపుల్ వన్ జీవో ప్రాంతానికి పక్కనే కోకాపేట్ ఉన్న విషయం తెలిసిందే. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో ఎకరం ధర రూ.5 నుంచి 6 కోట్లు పలుకుతుంటే.. కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరం ధర రూ.40 నుంచి రూ.50 కోట్లు పలుకుతోంది. ఈమధ్య ప్రభుత్వమేమో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయడంతో.. స్థల యజమానులు భూముల్ని అమ్మడం ఆపివేశారు. కొంతకాలం వేచి చూస్తే.. అధిక రేటుకు అమ్ముకోవచ్చని వీరి ఆశ. కాకపోతే, కొందరు కాస్త రేటు పెంచి అమ్మడానికి ప్రయత్నించినా.. కొనుగోలుదారులు ధైర్యంగా కొనేందుకు ముందకు రావట్లేదు. కోర్టులు ట్రిపుల్ జీవో మీద ప్రతికూల నిర్ణయం తీసుకుంటే ఎలా? అంత రేటు పెట్టి కొనడం వృథా కదా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పెట్టిన రేటు కూడా రాక.. మళ్లీ ధర పెరగడానికి ఇంకెంత కాలం పడుతుందేమోనని సందేహిస్తున్నారు.
This website uses cookies.