Categories: CONSTRUCTION

భూకంపాల్ని సులువుగా తట్టుకోవచ్చు!

  • ఐఐటీ ఢిల్లీ పరిశోధకుల ఘనత

ఢిల్లీ ఐఐటీ పరిశోధకులు మరో ఘనత సాధించారు. బాగా సాగే, భూకంపాలను మరింత సమర్థవంతంగా నియంత్రించే తక్కువ ధర గల పరికరాల్ని రూపొందించారు. పెద్దపెద్ద భవనాలు భూకంపాలను తట్టుకునేందుకు వీలుగా వీటిని నిర్మాణాల్లో వినియోగిస్తారు. ఇందుకు సంబంధించిన పేటెంట్ కోసం దరఖాస్తు కూడా చేసినట్టు అధికారులు వెల్లడించారు.

వాస్తవానికి భవనాలు భూకంపాలను తట్టుకునేందుకు వీలుగా సెస్మిక్ ఫోర్స్ రెసిస్టింగ్ సిస్టమ్ లేదా వైబ్రేషన్ కంట్రోల్ డివైసెస్ వంటి వాటిని వినియోగిస్తారు. అయితే, ఈ రెండు వ్యవస్థల పనిని ఈ కొత్త బ్రాసెస్ లు ఒక్కటే చేస్తాయని అధికారులు పేర్కొన్నారు.

This website uses cookies.