Categories: LATEST UPDATES

రిస్క్ త‌గ్గించే సేవ‌లకు పెద్ద‌పీట‌

  • రియాల్టీ డ్యూ డిలిజెన్స్ పై అధిక శ్ర‌ద్ధ‌
  • కొలియ‌ర్స్ తాజా నివేదిక వెల్ల‌డి

ప్రస్తుతం ఉన్న, రాబోతున్న 300 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయ భవనాల స్పేస్ ను రియల్ ఎస్టేట్ డ్యూ డిలిజెన్స్ ఆక్రమించుకోగలదని కొలియర్స్ సంస్థ అంచనా వేసింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణె ల్లో రాబోయే రెండు మూడేళ్లలో ఆఫీసు కార్యాలయ భవనాలు గణనీయంగా వస్తాయని పేర్కొంది. ఇందులో గ్రేడ్ ఏ ఆఫీస్ స్టాక్ 180 మిలియన్ చదరపు అడుగులు ఉందని, ప్రస్తుతం వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉందని తెలిపింది.

అదే సమయంలో ప్రధాన నగరాల్లో దాదాపు 120 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్ ఏ కార్యాలయ భవనాలు ఉన్నాయని వివరించింది. రాబోయే ప్రాజెక్టులు, ప్రస్తుతం కాలం చెల్లిన భవనాల అప్ గ్రెడేషన్ కోసం మూల్యాంకనం చేయడానికి డెవలపర్లు, పెట్టుబడిదారులు నిపుణుల సేవలను కోరుతున్నారని కొలియర్స్ తన తాజా నివేదిక ‘టెక్నికల్ డ్యూ డిజిలెన్స్: రిస్క్-ప్రూఫింగ్ రియాల్టీ‘లో పేర్కొంది. వివిధ వాటాదారులు తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి డ్యూ డిలిజెన్స్ ఎలా సాయపడుతుందో నివేదికలో వివరంగా పేర్కొన్నారు.

‘గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెరిగిన ట్రాక్షన్ తో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ లో విదేశీ మూలధన ప్రవాహం మునుపటి ఐదేళ్ల కాలంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగి 24 బిలియన్ డాలర్లకు చేరింది. దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నందున సాంకేతికంగా, కార్యాచరణకు అనగుణంగా ఉండే అత్యాధునిక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది. ఆస్తి యొక్క డ్యూ డిలిజెన్స్ నిర్వహణ ఖర్చు ప్రాజెక్టు వ్యయంలో 0.3 శాతం కంటే తక్కువ. డెవలపర్లు, పెట్టుబడిదారులు కొత్త ప్రదేశాలు, ఆస్తి తరగతుల్లోకి ప్రవేశించినందున డ్యూ డిలిజెన్స్ వారి కాబోయే ప్రాజెక్టులను రిస్క్ లేకుండా చేయడానికి సాయపడుతుంది. డబ్బు, సమయం నష్టపోకుండా చేయడంతోపాటు చట్టపరమైన ఇబ్బందుల నుంచి కాపాడుతుంది’ అని కొలియర్స్ ఇండియా టెక్నికల్ డ్యూ డిలిజెన్స్ ఎండీ జతిన్ షా చెప్పారు.

నిర్మాణంలో ఉన్న భవనాల కోసం డెవలపర్లు, పెట్టుబడిదాడరులతో పాటు అందులో ఉంటున్నవారు సైతం తమ పెట్టుబడులపై మెరుగైన రాబడి పొందడం, సకాలంలో నష్టాలు తగ్గించడం, లావాదేవీ ప్రక్రియలో ఎక్కువ పారదర్శకత కోసం డ్యూ డిలిజెన్స్ సేవలు పొందవచ్చు. ప్రస్తుతం ఆరు ప్రధాన నగరాల్లో పాతబడిన గ్రేడ్ ఏ స్టాక్ ఉంది. ఈ భవనాలు 15 ఏళ్ల కంటే పాతవి. వీటికి సంబంధించిన డెవలపర్లు, యజమానులు అప్ గ్రెడేషన్ అవసరాన్ని అర్థం చేసుకోవడానికి, అద్దెకు ఉంటున్నవారి నుంచి మరింత రాబడి పొందడానికి ఏం చేయాలో డ్యూ డిలిజెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. డ్యూ డిలిజెన్స్ నిపుణులు డెవలపర్లు, పెట్టుబడిదారులకు వారి పాత భవనాలను మెరుగుపరచడానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. దీనివల్ల అధిక ఆదాయం పొందడమే కాకుండా భవనం ఆయువు కూడా పెరుగుతుంది.

This website uses cookies.