Categories: LATEST UPDATES

సోమాజిగూడలో కార్పొరేట్ ఐకన్.. ప్రణవ వన్

సెంట్రల్ హైదరాబాద్ లో ఎత్తైన కమర్షియల్ టవర్

నిత్యం సందడిగా ఉండే సెంట్రల్ హైదరాబాద్ లో కార్పొరేట్ ఐకన్ వెలసింది. సోమాజిగూడలో ఎత్తైన కమర్షియల్ టవర్ వచ్చింది. ప్రణవ గ్రూప్ నిర్మించిన ఈ అద్భుతమైన ఆర్కిటెక్చరల్ భవనం పేరు ‘వన్’. అటు పర్యావరణహితంగానూ, ఇటు ఆధునిక డిజైన్ తోనూ 19 అంతస్తుల్లో అద్భుతంగా దీనిని నిర్మించారు. సోమాజిగూడలో ఉన్న ఏకైక హరిత భవనం ఇదే కావడం విశేషం. వినూత్న రూపకల్పన, స్థిరత్వం పట్ల ప్రణవ గ్రూప్ నిబద్ధతకు నిదర్శనంగా ఈ భవనానికి ఐజీబీసీ ప్రీ గోల్డ్ సర్టిఫికెట్ కూడా ల‌భించింది.

గ్రౌండ్ ప్లస్ 18 అంతస్తుల్లో నిర్మితమైన ఈ భవనం 5 లక్షల చదరపు అడుగుల స్థలం కలిగి ఉంది. ఒక్కో అంతస్తులో 27 వేల చదరపు అడుగుల స్పేస్ ఉంది. ప్రైవేట్ ఆఫీస్ స్పేస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, లాకబుల్ కేబిన్స్, మిటింగ్, కాన్ఫరెన్స్ రూమ్స్, సీఈఓ కేబిన్ వంటి డెడికేటెడ్ డెస్కులు ఉన్నాయి. అలాగే హెల్త్ క్లబ్, క్రెష్, బ్యాంకు, ఏటీఎం, కేఫ్, ఫుడ్ కోర్టు వంటి సౌకర్యాలనూ ఏర్పాటు చేశారు. ఏంపిల్ కార్ పార్కింగ్ తోపాటు విజిటర్ల కోసం ప్రత్యేక కార్ పార్కింగ్, ఈవీ చార్జింగ్ పాయింట్స్, సీసీటీవీ నిఘా వ్యవస్థ, పూర్తి స్థాయి సెక్యూరిటీ ఉంది. నిమ్స్ ఆస్పత్రికి ఒక నిమిషంలో, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ కు 2 నిమిషాల్లో, లకడీకాపూల్ కి 5 నిమిషాల్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు, పీవీ ఎక్స్ ప్రెస్ హైవేకి 15 నిమిషాల్లో, హైటెక్ సిటీ, జూబ్లీ బస్ స్టేషన్ కి 20 నిమిషాల్లో, సెంట్రల్ బస్ స్టేషన్ కు 25 నిమిషాల్లో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకోవచ్చు.

This website uses cookies.