భారత సంతతికి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ పై అమెరికాలో మోసం కేసు నమోదైంది. 93 మిలియన్ డాలర్ల మేర మోసానికి పాల్పడ్డారని మియామీకి చెందిన డెవలపర్ రిషి కపూర్ పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) పేర్కొంది. ఈ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ కంపెనీ లొకేషన్ వెంచర్స్, దాని అనుబంధ సంస్థ ఉర్బిన్, 20 ఇతర సంబంధిత సంస్థలపై కూడా అభియోగాలు మోపినట్టు తెలిపింది. 2018 జనవరి నుంచి 2023 మార్చి వరకు కపూర్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల కోసం తప్పుడు వివరాలతో పలువురిని ఆకర్షించినట్టు వివరించింది. ఇలా కపూర్ 4.3 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడిదారుల నిధులు దుర్వినియోగం చేయగా.. లొకేషన్ వెంచర్స్, ఉర్బిన్, ఇతర సంస్థలు దాదాపు 60 మిలియన్ డాలర్ల మేర అక్రమంగా మూలధనం సేకరించినట్టు విచారణ తేలింది. ఈ సొమ్మును విలాసాలకు ఖర్చు చేశారని వెల్లడైంది. కపూర్ 50 మందికి పైగా పెట్టుబడిదారులు మిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్టు విచారణలో తేలిందని ఎస్ఈసీ మియామీ రీజనల్ డైరెక్టర్ ఎరిక్ ఐ బస్టిలో తెలిపారు.
This website uses cookies.