Categories: LATEST UPDATES

డేటా సెంటర్ల గమ్యస్థానం.. కర్ణాటక

డేటా సెంటర్ల గమ్యస్థానంగా కర్ణాటక నిలవనుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన డేటా సెంటర్ విధానం కారణంగా దేశంలో ప్రీమియం డెటా సెంటర్ గమ్యస్థానంగా కర్ణాటక నిలవనుందని అభిప్రాయపడింది. అలాగే ఈ డేటా సెంటర్ విధానం ఉండటం వల్ల దేశంలోని అగ్రశ్రేణి డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కర్ణాటక ఉంటుందని అంచనా వేసింది. బిగ్ డేటా, ఇండస్ట్రీ 4.0, 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటివి పెరగడంతోపాటు భారతీయ ఓటీటీ స్ట్రీమింగ్ పరిశ్రమ కూడా విస్తరిస్తుండటంతో కర్ణాటకలో డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతుందని వివరించింది.

* టెక్నాలజీ హబ్, వ్యూహాత్మక ప్రదేశం, మిగులు విద్యుత్, నైపుణ్యం కలిగిన ప్రతిభ, పారిశ్రామిక వృద్ధి, అనుకూలమైన విధానాలు, తక్కువ పర్యావరణ రిస్క్ వంటి పలు అంశాలు కర్ణాటక ప్రీమియం డేటా సెంటర్ గమ్యస్థానంగా నిలిచేందుకు దోహదపడ్డాయని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. విద్యుత్ టారిఫ్ లో రాయితీ, భూ సబ్సిడీ, పెట్టుబడులపై ప్రోత్సాహం, స్టాంపు డ్యూటీ మినహాయింపు సహా కర్ణాటక అంతా వర్తించే ఇతర ప్రోత్సాహకాల వల్ల రాష్ట్రం భారీగా డేటా సెంటర్లను ఆకర్షించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

This website uses cookies.