మనీ లాండరింగ్ కేసులో ఏడాది క్రితం అరెస్టయిన ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లు బాబూలాల్ వర్మ, కమల్ కిషోర్ లకు బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు నిరాకరించింది. ఆర్థిక నేరాలను అత్యంత తెలివైన వ్యక్తులు మాత్రమే చేస్తారని, అందువల్ల వారిని విడుదల చేయడం విచారణకు మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. వడాలలో స్లమ్ రీహాబిలిటేషన్ అథార్టీ పథకం కింద పునరావాస భవనాల నిర్మాణం కోసం యెస్ బ్యాంకు నుంచి ఓంకార్ గ్రూప్ రూ.410 కోట్ల రుణం తీసుకుంది. అయితే, ఈ నిధులను తమకు చెందిన ఇతర కంపెనీలకు మళ్లించింది. అనంతరం దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో రూ.87 కోట్లను పక్కదారి పట్టించే విషయంలో వ్యాపారవేత్త సచిన్ జోషి సహకరించారని ఆరోపించింది. దీంతో జోషితోపాటు గుప్తా, వర్మలపై అభియోగాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు తాజాగా విచారించింది. అయితే, వారి బెయిల్ ను ఈడీ వ్యతిరేకించింది. రూ.410 కోట్లను 14 కంపెనీల ద్వారా దారి మళ్లించారని కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.
This website uses cookies.