రోజంతా శ్రమించి ఇంటికొచ్చాక సేద తీరేందుకు.. చాలామంది షవర్ల కిందికి చేరుతారు. ఆఫీసు నుంచి వచ్చినా.. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా.. సాయంత్రం కాగానే ఎంచక్కా షవర్ స్నానం చేస్తుంటారు. అయితే, ఆధునిక యువతీయువకులు ఇంటి యజమానులు మారుతున్న క్రమంలో.. వీరంతా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గల నిర్మాణ సామగ్రిని కొనేందుకు ముందుకొస్తున్నారు. జాగ్వార్, ప్యారీవేర్ వంటివి మార్కెట్లో ఉన్నప్పటికీ.. ఆధునిక సూపర్ షవర్ అనేవి 2007 తర్వాతే మనదేశంలోకి ప్రవేశించాయని చెప్పొచ్చు. షవర్ అనుభవాన్ని ఆస్వాదించేవారు కోహ్లెర్ వైపు చూస్తున్నారు.
* హైదరాబాద్‌లో షవర్ల కనీస ధర.. రూ.1000 నుంచి ఆరంభమవుతుంది. గరిష్ఠంగా రూ.20 లక్షల దాకా వివిధ రకాలున్నాయి. ఆధునిక యువతీయువకుల ఆలోచనా విధానం మారుతోంది. తమ ఇళ్లలో ప్రపంచ స్థాయి ఉత్పత్తులుండాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో బాత్ రూముల్ని గ్లామర్ రూములుగా తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం ఎంత ఖర్చయినా చేయడానికి వెనకాడటం లేదు. వీరి కోసం రకరకాల రంగుల్లో లగ్జరీ షవర్లు అందుబాటులోకి వచ్చేశాయి.
సూపర్ షవర్ ఏ రకం.. ధర ఎంత?
షవర్ క్యాబిన్లు
బ్రాండ్ – ఓయస్టర్
ధర– రూ.2.2 లక్షల నుంచి 6 లక్షలు
వర్ల్ పూల్ బాత్ టబ్స్
బ్రాండ్ – ఓయస్టర్
ధర– రూ.1.25 లక్షల నుంచి 60 లక్షలు
ఆధునిక రకాలు
బ్రాండ్ : కోహ్లెర్
ధర: రూ.2 లక్షల నుంచి 4.5 లక్షలు
స్టీమ్ అండ్ సానా
బ్రాండ్ : ఓయస్టార్
ధర : రూ.5.5 లక్షల నుంచి 8 లక్షలు
స్పా
బ్రాండ్ : ఓయస్టార్
ధర : రూ.6 లక్షల నుంచి 20 లక్షలు
ఆధునిక రకాలు..
మిలీనియల్స్, హై నెట్ వర్త్ ఇండివిడ్యుయల్స్ అంతర్జాతీయ షవర్లను కొనేందుకు ఆసక్తి చూస్తున్నారు. వీరంతా సౌకర్యంగా సేదతీరేందుకు ఆలోచిస్తున్నారు తప్ప ధర గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారికోసం కోహ్లెర్ బ్రాండ్ చక్కగా పనికొస్తుంది. ఇందులో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి.