Categories: LATEST UPDATES

తాత్కాలిక ఓసీలు ఇవ్వొద్దు

అధికారులకు రెరా ఆదేశం

కంప్లీషన్ సర్టిఫికెట్ (సీసీ), ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ)లను తాత్కాలికంగా జారీ చేయొద్దని ఉత్తర ప్రదేశ్ రెరా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తాత్కాలిక ఓసీలు, సీసీలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని.. అందువల్ల ఎవరూ అలాంటివి జారీ చేయొద్దని స్పష్టం చేసింది. అలాగే సీసీ, ఓసీ జారీ చేసేటప్పుడు ఆ ప్రాజెక్టులోని టవర్ లేదా బ్లాక్ పేరు తప్పనిసరిగా పేర్కొనాలని సూచించింది. ఈ మేరకు అన్ని ఇండస్ట్రియల్, హౌసింగ్ డెవలప్ మెంట్ అధికారులకు ఆదేశాలిచ్చింది.

సీసీలు, ఓసీలు జారీ చేసే సమయంలో కేవలం ఆ ప్రాజెక్టు పేరు మాత్రమే పేర్కొంటున్నారని.. టవర్ లేదా బ్లాక్ పేరు ప్రస్తావించడంలేదని రెరా గుర్తించింది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా సదరు టవర్ లేదా బ్లాక్ పేరు ఓసీ, సీసీలో పేర్కొనాలని స్పష్టం చేసింది.

This website uses cookies.