హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో శునకాల రిజిస్ట్రేషన్ సులువు కానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. వచ్చే నెలలో ఈ యాప్ ను ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. తాజా మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని శునకాల యజమానులు సులువుగా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. అరవింద్ కుమార్ ట్వీట్ చూశాక పలువురు నెటిజన్లు స్పందించారు.
ఈ శునకాల యజమానులు.. వాటిని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కూడా తెచ్చుకోవాలని.. ఎందుకంటే అవి వీధుల్లో ఎక్కడపడితే అక్కడ పాడు చేస్తున్నాయని.. అందుకే వాటి యజమానులు తప్పకుండా ప్లాస్టిక్ కవర్లను వెంటబెట్టుకుని రావాలని సూచించారు. ఇలా చేస్తే ప్రతి కాలనీలోని పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఇందుకోసం నిర్వహణ రుసుముల్ని ఆయా శునకాల యజమానుల నుంచి వసూలు చేయాలని అంతేతప్ప ఇతర పన్ను చెల్లింపుదారుల్ని చేయకూడదన్నారు.
This website uses cookies.