Categories: LATEST UPDATES

న్యాక్ కు జాతీయ స్థాయి అవార్డు

  • బెస్ట్ ఇనిస్టిట్యూట్ ప్లేస్మెంట్ అవార్డ్ కైవసం చేసుకున్న న్యాక్
  • ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఇది సాధ్యమైంది
  • న్యాక్ డిజి భిక్షపతి, డైరెక్టర్స్, ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు
  • న్యాక్ వైస్ చైర్మన్, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ (ఎన్ఏసీ)ను జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఉపాధి కల్పనలో దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ గా నిలిచినందుకు ఈ అవార్డు ను కైవసం చేసుకుంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో “ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా” అద్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. వర్చువల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ తరుపున న్యాక్ డిజి భిక్షపతి, డైరెక్టర్ శాంతి శ్రీ పాల్గొన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బేస్, జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మాహతో సమక్షంలో న్యాక్‌ డైరెక్టర్ జనరల్ పేరున ఈ అవార్డు ప్రకటించారు. యువతకు మంచి జీవనోపాధి కల్పించినందుకు ఈ అవార్డు దక్కినట్లు న్యాక్‌ డిజి భిక్షపతి వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో కరోనా లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా గత మూడేళ్ళలో 42వేల మంది యువతకు నిర్మాణరంగ వృత్తులలో ఆఫ్ లైన్ శిక్షణనిచ్చి న్యాక్‌ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుందని న్యాక్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందులో 9,466 మంది యువత ఉపాధి శిక్షణ తీసుకొని ప్రముఖ ప్రఖ్యాతి గాంచిన నిర్మాణరంగ సంస్థలల్లో ఏడాదికి 2 నుంచి 5 లక్షల వరకు గల ప్యాకేజీతో ప్లేస్మెంట్ పొందారని గుర్తు చేశారు. రాష్ట్ర న్యాక్ కు దక్షిణ భారతదేశంలో బెస్ట్ ఇనిస్టిట్యూట్ ప్లేస్మెంట్ అవార్డు వ‌చ్చేలా కృషి చేసిన న్యాక్ డిజి భిక్షపతి, డైరెక్టర్స్, న్యాక్ ఉద్యోగులకు మంత్రి వేముల ప్రత్యేకంగా అభినందలు తెలిపారు.

This website uses cookies.