Categories: Celebrity Homes

మ‌ధుర క్ష‌ణాల్ని ఆస్వాదించాలి! బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్

‘బియాండ్ ది క్లౌడ్స్’లో అతడి అద్భుతమైన పాత్ర నుంచి ‘ధడక్’ లో ఆకట్టుకునే నటన వరకు నటుడు ఇషాన్ ఖట్టర్ అనతి కాలంలోనే బాలీవుడ్ లో ప్రాముఖ్యత సంపాదించుకున్నారు. పరిశ్రమలో తనకు ఓ సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంటూనే, ఆన్-స్క్రీన్‌పై మాత్రమే కాకుండా ఆఫ్-స్క్రీన్‌పై కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. తన కళాత్మక సున్నితత్వానికి, యువశక్తికి నిదర్శనంగా ఓ కలల సౌధం సృష్టించుకున్నారు.

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడిగా వెలుగులోకి వచ్చిన ఖట్టర్.. 2005లో వచ్చిన ‘వాహ్! లైఫ్ హో తో ఐసీ’ అనే చిత్రంలో బాల న‌టుడిగా అరంగేట్రం చేశారు. 2017కి వచ్చేసరికి ‘బియాండ్ ది క్లౌడ్స్’లో ఖట్టర్ ప్రముఖ పాత్ర ఆయనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ పురుష నటుడి అరంగేట్రం కింద ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. ఇక రొమాంటిక్ డ్రామా ‘ధడక్’ విజయం ఆయన్ను వర్థమాన నటుడిగా నిలబెట్టింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ఖట్టర్ ప్రతిభను ప్రశంసించారు. ఖట్టర్ బహుముఖ ప్రజ్ఞ బ్రిటిష్ మినీ సిరీస్ ‘ఎ సూటబుల్ బాయ్’లో మరింత కనిపించింది. ఆ సినిమాలో ఆయన నటనపై ప్రశంసలు కురిశాయి. ఖట్టర్ స్టార్ డమ్ వేగంగా వచ్చినప్పటికీ, ఇష్టమొచ్చినట్టు చెలరేగిపోలేదు. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకున్నారు. అదే సమయంలో తన ఆదర్శవంతమైన అభయారణ్యం.. తన కలల సౌధం ఏర్పరుచుకునేందుకు కూడా ప్రయాణం ప్రారంభించారు.

ఖట్టర్ తన కలల ఇంటిని కేవలం అందంగా ఉండాలని మాత్రమే కాకుండా.. సృజనాత్మకత, యవ్వనంగా, స్ఫూర్తిమంతంగా ఉండాలని ఆకాంక్షించారు. అధునాతన భావాన్ని కొనసాగిస్తూనే.. వెచ్చదనం, చైతన్యాన్ని అందించే వ్యక్తిగత స్థలంలో తన వ్యక్తిత్వాన్ని, కళానైపుణ్యాన్ని ప్రతిబింబించే ఇంటి నిర్మాణం వైపు అడుగులు వేశారు. ఫర్నిచర్ కు మిక్స్ అండ్ మ్యాచ్ విధానాన్ని జోడించారు. అలాగే వివిధ రకాల శైలులు, టెక్చర్లు, రంగులను ఆయన ఇల్లు కలిగి ఉంది. మొక్కలు, సహజ మూలకాల సమృద్ధితో ఇంట్లోని ప్రతి మూలా ప్రశాంతతకు నిలయంగా, ఆహ్లాదకరమైన వాతావరణానికి వేదికగా ఓ నిర్మలమైన మనోజ్ఞతను వెదజల్లేలా ఉంది. ఖట్టర్ లోని అంతులేని ఎనర్జీ.. ఇల్లంతా కనిపిస్తుంది. విశ్రాంతి కోసం హాయిగా సేదతీరే ప్లేస్ ల నుంచి ఇంట్లోని ప్రతి అంశమూ ఖట్టర్ పరిశీలనాత్మక అభిరుచులు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా ఖట్టర్‌కు సినిమా పట్ల ఉన్న ప్రేమ ఆయన ఇంట్లో కనిపిస్తుంది. పాతకాలపు సినిమా పోస్టర్ల నుంచి ఐకానిక్ సినిమాల స్మృతి చిహ్నాల వరకు ఖట్టర్ ఇంట్లో చాలా అంశాలు కనిపిస్తాయి.

ఖట్టర్ తన కలల ఇంటికి తలుపులు తెరిచినప్పుడు.. వెచ్చదనం చల్లదనాన్ని కలిసేలా, చైతన్యం అధునాతనను కలిసేలా, సృజనాత్మకత సౌకర్యాన్ని కలిసేలా ఉన్న ప్రపంచంలోకి ప్రజలను ఆహ్వానిస్తారు. ఇంట్లోని ప్రతి మూలలో, ప్రతి అంశంలో ఖట్టర్ యవ్వన ఉత్సాహం, కళాత్మక వ్యక్తీకరణ కనిపిస్తాయి. ఇషాన్ కట్టర్ దృక్కోణంలో కలల ఇల్లు అంటే కేవలం ఓ భౌతిక స్థలాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా.. సృజనాత్మకతను పెంపొందించే, అభిరుచిని ప్రేరేపించే, జీవితంలోని అందమైన క్షణాలను ఆస్వాదించే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం. బాలీవుడ్ లోనూ బయటా తనదైన ముద్ర కొనసాగిస్తున్న ఖట్టర్ ఇల్లు.. సంపూర్ణంగా జీవించాలనే ఆయన అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.

This website uses cookies.