Categories: LATEST UPDATES

రెరా కాల్ సెంటర్ ఏర్పాటు

ఇళ్ల కొనుగోలుదారుల సమస్యల్ని పరిష్కరించడంలో మహారాష్ట్ర రెరా అథారిటీ ఒక అడుగు ముందుకేసింది. డెవలపర్ల వద్ద అపార్టుమెంట్లను కొన్న తర్వాత నెలకొనే వివాదాల్ని పరిష్కరించేందుకు ఏకంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదివరకే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినప్పటికీ, కరోనా నేపథ్యంలో అధిక శాతం మంది ప్రజలు రెరా కార్యాలయాన్ని సందర్శించడానికి జంకుతున్నారు.

ఈ ఇబ్బందిని అర్థం చేసుకున్న మహా రెరా సభ్య కార్యదర్శి వసంత్ ప్రభు తాజాగా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ ఈ కాల్ సెంటర్ పని చేస్తుందని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఒక జట్టును ఇప్పటికే నియమించామని తెలిపారు. సాంకేతిక అంశాల గురించి సమస్యల్ని ఎదుర్కొనే హోమ్ బయ్యర్ల కోసం ప్రత్యేకంగా సాంకేతిక టీమును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరి, తెలంగాణలో ఇలాంటి కాల్ సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో? ఇంటి కొనుగోలుదారుల సమస్యల్ని ఎప్పుడు పరిష్కరిస్తారో??

This website uses cookies.