జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) డేటాబేస్ ఏర్పాటు దిశగా చెన్నై కార్పొరేషన్ దృష్టి సారించింది. భవనాలను మ్యాపింగ్ చేయడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు చెక్ పెట్టడంతోపాటు రెవెన్యూ కలెక్షన్ తదితర అంశాల్లోనూ ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందని భావిస్తోంది. డ్రోన్లు ఉపయోగించడంతోపాటు ఉపగ్రహ ఛాయాచిత్రాలు, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా భవనాల వివరాలను సేకరించి 190 వార్డుల్లో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు.
ఇంకా పది వార్డుల్లో ఈ ప్రక్రియ మిగిలి ఉంది. మొత్తం రూ.8.3 కోట్ల వ్యయంతో 82 మంది అధికారులతో ప్రత్యేకంగా జీఐఎస్ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందలో జీఐఎస్ నిపుణులు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు ఉంటారు. వీరంతా రెవెన్యూ, ఫైనాన్స్ శాఖ డిప్యూటీ కమిషనర్ కు రిపోర్ట్ చేస్తారు. జీఐఎస్ డేటా బేస్ ను ఉపయోగించా నగరంలోని భవనాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని పోల్చి చూస్తారు. అందులో ఏవైనా తేడాలుంటే వాటిపై చర్యలు తీసుకుంటారు.
జీఐఎస్ డేటా బేస్ ద్వారా ఆస్తి పన్నును కచ్చితంగా వసూలు చేయనున్నారు. కాగా, ఇలాంటి ప్రక్రియ మన రాష్ట్రంలో కూడా గతంలోనే చేపట్టారు. ఆస్తి పన్ను మదింపు, అక్రమ అంతస్తుల్ని గుర్తించేందుకు తెలంగాణ పురపాలక కొంత కసరత్తు చేసింది. కానీ తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. పురపాలక శాఖ అధికారులు ఆ విషయాన్ని మర్చిపోయారో లేక కావాలనే పక్కన పెట్టేశారో తెలియదు కానీ, ఇప్పటికైనా ఆ పనిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This website uses cookies.