Categories: LATEST UPDATES

ఇళ్ల ధరల సూచీలో పెరుగుదల

  • 2021-22 నాలుగో త్రైమాసికంలో
    1.8 శాతం మేర పెరిగిన ధరలు
  • రిజర్వ్ బ్యాంకు వెల్లడి

అఖిల భారత ఇళ్ల ధరల సూచీ (హెచ్ పీఐ) స్వల్పంగా పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్ పీఐ 1.8 శాతం మేర పెరిగినట్టు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఇది తక్కువేనని పేర్కొంది. అప్పుడు 2.7 శాతం మేర అధికం కాగా, ఈ ఏడాది ఆ త్రైమాసికంలో 1.8 శాతం మాత్రమే పెరుగుదల నమోదైందని వివరించింది.

అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, కాన్పూర్, కోచి, కోల్ కతా, లక్నో, ముంబైల్లోని హౌసింగ్ రిజిస్ట్రేషన్ అథార్టీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రిజర్వ్ బ్యాంకు మూడు నెలలకోసారి ఇళ్ల ధరల సూచీని విడుదల చేస్తుంది. ‘2021-22 నాలుగో త్రైమాసికంలో అఖిల భారత హెచ్ పీఐ వార్షిక వృద్ధి 1.8 శాతం మేర పెరిగింది. మూడో త్రైమాసికంలో ఇది 3.1 శాతం మేర ఉండగా.. ఏడాది క్రితం 2.7గా నమోదైంది’ అని వివరించింది. నగరాలవారీగా కూడా ఈ వృద్ధిలో తేడాలున్నాయి. కోల్ కతాలో ఇది 19.2 శాతం కాగా, బెంగళూరులో 11.3 శాతంగా నమోదైంది.

This website uses cookies.