దేశంలో స్మార్ట్ సిటీ గడువును వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీల కింద ఇప్పటికే ఆమోదించి, నిధులు కేటాయించిన పనులు కొనసాగించాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ సమయంలో కొత్త పనులు మంజూరీ మాత్రం ఉండదని పేర్కొంది. జరుగుతున్న పనులకు సంబంధించి నిధులను తొలుత వచ్చినవారికి తొలుత ప్రాతిపదికన విడుదల చేస్తామని స్పష్టంచేసింది. వాస్తవానికి స్మార్ట్ సిటీ మిషన్ గడువు గతనెల 30తో ముగిసింది.
ఈ మిషన్ కింద దేశవ్యాప్తంగా వంద నగరాల్లో రూ.1.44 లక్షల కోట్ల విలువైన 7,188 పనులు పూర్తయ్యాయి. మొత్తం మంజూరైన పనుల్లో ఇది 90 శాతం. మన రాష్ట్రానికి వచ్చేసరికి స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్ లలో పనులు చేపట్టారు. వరంగల్ లో ఇప్పటికి 45 పనులు పూర్తి కాగా.. రూ.518 కోట్ల విలువైన 66 పనులు జరుగుతున్నాయి. అలాగే కరీంనగర్ లో 25 పనులు పూర్తి కాగా.. రూ.287 కోట్లతో చేపట్టిన 22 పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ తోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించాలని కేంద్రాన్ని అభ్యర్థించగా.. 2025 మార్చి 31 వరకు పొడిగించింది.
This website uses cookies.