Categories: LATEST UPDATES

ప్రీమియం ప్రాపర్టీలకు భారీ డిమాండ్..

  • ఏడాదిలోనే 50 శాతానికి పైగా పెరుగుదల

దేశంలో ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రీమియం ప్రాజెక్టుల్లోని ఫ్లాట్ల ధరలు బాగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది వాటి ధరలు ఏకంగా 53 శాతం పెరిగాయి. పూర్తయిన ప్రాజెక్టులతో పోలిస్తే.. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల ధరలు 30 శాతం ఎక్కువగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టుల్లో మరిన్ని సౌకర్యాలు ఉండటమే ఇందుకు కారణం.

చాలామందికి సెకండ్ హోమ్ లొకేషన్ గా ఉన్న నార్త్ గోవాలో విల్లాల ధరలు ఏడాదిలోనే 28 శాతం మేర పెరిగాయి. కంపెనీలు వర్క్ ఫ్రం ఎనీవేర్ ఆప్షన్ ఇవ్వడం, గోవాలో అద్దె ఆదాయం ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రాపర్టీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాగే 2024 తొలి అర్ధభాగంలో కొనుగోలుదారుల సెంటిమెంట్ బాగా పెరిగింది. గ్రేడ్-ఎ కారిడార్లలో పాత డెవలప్ మెంట్లకు అటు కొనుగోలుదారులు, ఇటు అద్దెదారుల నుంచి డిమాండ్ ఉంది.

This website uses cookies.