ఇల్లు, స్తిరాస్థి కొనుగోలుదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని రెరా నిర్ణయించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 39 వేల మంది ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడానికి మహా రెరా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లోగా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నరెడ్కో సహా నాలుగు సంస్థలకు శిక్షణ బాధ్యత అప్పగించింది. ఏజెంట్లకు ముందుగా శిక్షణ ఇచ్చి, అనంతరం పరీక్ష కూడా నిర్వహిస్తారు.అటు కొనుగోలుదారులకు, ఇటు అమ్మకందారులకు మధ్య ఉండే ఏజెంట్లు రెండు పార్టీలనూ సరైన దిశగా నడిపించేందుకు ఈ శిక్షణ ఉపకరిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ రంగంలో ఇది మరింత పారదర్శకత తీసుకొస్తుందని తెలిపాయి.