Categories: LATEST UPDATES

నేటి నుంచి వక్ఫ్ బోర్డు బాధితుల ఆమరణ దీక్ష

చట్టబద్ధమైన అన్ని పత్రాలూ కలిగి ఉండి, ఎప్పటి నుంచో అక్కడే నివసిస్తున్నప్పటికీ తమ ఆస్తులపై తమకు హక్కు లేదన్న ప్రభుత్వ వాదనకు నిరసనగా 18న ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న‌ట్లు వక్ఫ్ బోర్డు బాధితుల జేఏసీ నాయకులు ప్రకటించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభమవుతుందని వెల్లడించారు. అందరి ఆస్తులకూ ఉన్నట్టే తమకూ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, ఎల్ఆర్ఎస్ లు, మున్సిపల్ పర్మిషన్లు, ఇంటి నెంబర్లు, పట్టాదార్ పాస్ పుస్తకాల వంటివన్నీ ఉన్నాయని.. రోడ్డు, డ్రైనేజ్, కరెంట్, తాగునీరు వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు.

ఇవన్నీ ఉన్నా కూడా 2018 నుంచి తమ ఆస్తిపై తమకే హక్కు లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వాటిని వక్ఫ్ భూములుగా చిత్రకరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్లో 2016లో వేసిన హెచ్ఎండీఏ లేఔట్ ని కూడా 2019 నుంచి వక్ఫ్ భూములుగా ప్రకటించారన్నారు. బోడుప్పల్ పరిధిలో ఇంకా 3వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయని అసెంబ్లీలో ప్రకటించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తమక జరుగుతున్న అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో ఆమరణ దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.

This website uses cookies.