Categories: Celebrity Homes

గౌరీఖాన్ డిజైన‌ర్ హోమ్స్

గౌరీఖాన్ అంటే బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ భార్యగానే కాదు.. ఇంటీరియర్ డిజైనింగ్ లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. గౌరీఖాన్ డిజైన్స్ పేరుతో ఎందరో సెలబ్రిటీల ఇళ్లలో తనదైన ముద్ర వేశారు. సమకాలీన, వ్యక్తిగత డిజైన్ల సమ్మేళనంతో డిజైన్ మేజిక్ చేసి చూపించారు. అంబానీల నుంచి బచ్చన్ ల వరకు ఆమె జాబితాలో అగ్రశ్రేణి నటులు, చిత్ర నిర్మాతలు, డిజైనర్లు, వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. మరి గౌరీఖాన్ డిజైన్ చేసిన ఓ ఐదుగురు సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లొద్దామా?

సిద్ధార్థ మల్హోత్రా బ్యాచిలర్ పాడ్..


ముంబై పాలి హిల్ లోని సిద్ధార్థ మల్హోత్రా ఇంటిని గౌరీఖాన్ డిజైన్ చేశారు. లేత గోధుమరంగు, క్రీమ్, మావ్ వంటి మ్యూటెడ్ రంగులు.. చెవ్రాన్ ఫ్లోరింగ్, వుడెన్ డిజైన్స్, ఆకర్షణీయమైన ఆర్ట్ వర్క్ తో సాధారణ బ్యాచిలర్ ప్యాడ్ కంటే చాలా సొగసైనదిగా కనువిందు చేస్తోంది.

బాంద్రాలో ఆలియాభట్ ఇల్లు..


ప్రముఖ నటి ఆలియా భట్ నివాసం వాస్తు పాలి హిల్ కాంప్లెక్స్ లో ఉంది. పెళ్లికి ముందు ఆమె భర్త రణబీర్ కపూర్ అక్కడే ఉండేవాడు. రూ.32 కోట్ల విలువైన ఆలియా భట్ ఫ్లాట్ ను గౌరీఖానే డిజైన్ చేశారు. కలప, పాస్టెల్ ఎలిమెంట్స్ తో మిలీనియల్ ఏస్తెటిక్స్ ఉపయోగించి అద్భుతమైన ఇంటీరియర్ ఏర్పాటు చేశారు.

కరణ్ జోహార్ కార్టర్ రోడ్ డ్యూప్లే..


గౌరీ, షారుక్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన కరణ్ జోహార్ కార్టర్ రోడ్ డూప్లెక్స్ లో ఇంటీరియర్ డిజైన్ చేసింది గౌరీనే. కరణ్ ఇంటికి పాత అందంతోపాటు కొత్త చిక్ లుక్ ఇవ్వడం కోసం యాంబియంట్ లైటింగ్, గోల్డెన్ ఎలిమెంటస్, హాయిగా ఉంటే సీటింగ్.. ఇంకా అనేక రకాల మొక్కలను వినియోగించారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అపార్ట్ మెంట్..


జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు జూహూలో ఉన్న అపార్ట్ మెంట్ లో ఇంటీరియర్ డిజైన్ మొత్తం గౌరీఖానే చేశారు. తన ఇంట్లో రీడింగ్ నూక్ తన ఫేవరేట్ కార్నర్ అని.. ఇక తన బెడ్ రూం అంటే అమితమైన ఇష్టమని జాక్వెలిన్ చెప్పారు. వాల్ పేపర్, బోల్ స్టర్స్, కుషన్లు, నిచ్చెనతో సహా అన్నీ పూల డిజైన్ ఉండేలా ఆ గదికి పర్సియన్ రూపం తీసుకొచ్చారు. ఇక లేత గోధుమరంగులో ఉన్న సీలింగ్ ల్యాంప్ చూపరులను కట్టి పడేస్తుంది.

షారుక్ ఢిల్లీ మేన్షన్..


దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్కులో ఉన్న షారుక్ రాజభవనం సొగసైన, అధునాతమైన వైబ్ ఇస్తుంది. అదిరిపోయే షాండ్లియర్లు, స్పైరల్ మెట్లు, ఫ్రెంచ్ కిటికీలు, ఖరీదైన మంచాలు, మొక్కలతో తమ భవనాన్ని గౌరీ అద్భుతంగా తీర్చిదిద్దారు.

This website uses cookies.