Categories: PROJECT ANALYSIS

జీహెచ్ఆర్ కాలిస్టోలో కొంటే జీవితం ఆనంద‌మ‌య‌మే..

  • స్మార్ట్, సస్టైనబుల్ ప్రీమియం
    లగ్జరీ అపార్ట్ మెంట్లు
  • చదరపు అడుగు ధర
    కేవలం రూ.5,799 మాత్రమే
స్మార్ట్, స్థిరత్వ జీవన కాలానికి తగిన ఇంటి కోసం చూస్తున్నారా? అయితే, తెల్లాపూర్ త‌ర్వాతి కొల్లూరులో జీహెచ్ఆర్ సంస్థ చేపట్టిన కాలిస్టో ప్రాజెక్టుని చూడాల్సిందే. స్థిరత్వంతోపాటు స్మార్ట్ పోకడలనూ ఇందులో జోడించారు. తద్వారా ప్రీమియం స్మార్ట్ లివింగ్ కు తలుపులు తెరిచారు.

 

జీహెచ్ఆర్ కాలిస్టోను మొత్తం 8.3 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో వ‌చ్చేవి నాలుగు ట‌వ‌ర్ల‌లో 11 బ్లాకుల్ని నిర్మిస్తారు. ఒక్కో బ్లాకును 18 అంతస్తుల్లో డెవ‌ల‌ప్ చేస్తున్నారు. 1195 చదరపు అడుగుల నుంచి 1915 చదరపు అడుగుల్లో 2, 3, 4 బీహెచ్ కే ఫ్లాట్లు వ‌స్తాయి. మొత్తం నిర్మించే ఫ్లాట్ల సంఖ్య‌.. ఎంత‌లేద‌న్నా 1190 అపార్ట్ మెంట్ల దాకా ఉంటాయి. అంతేకాదు, 3300 చదరపు అడుగుల నుంచి 3385 చదరపు అడుగుల్లో స్కై విల్లాలు కూడా ఉన్నాయి.

పలు ఆధునిక సౌకర్యాలతోపాటు ఇందులో జీవించేవారి జీవనశైలిని మరింత మెరుగ్గా చేయడం కోసం ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన క్లబ్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్ హౌస్ లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో తీరిక సమయాన్ని ఉల్లాసంగా, ఉత్తేజంగా గడిపేందుకు బోలెడు ఇండోర్ గేమ్స్ తోపాటు పలు ఆకర్షణీయ అంశాలు ఉన్నాయి. స్విమింగ్ పూల్, క్రికెట్, జిమ్, స్పా తదతరాలు మీకు మనో ఉల్లాసం కలిగిస్తాయి. మూడు స్విమింగ్ పూల్స్, 24 గంటల సెక్యూరిటీ, యాంఫిథియేటర్, వర్క్ ఫ్రం హోం కో వర్కింగ్ స్పేసెస్, ఇండోర్, ఔట్ డోర్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలూ ఉన్నాయి.

లొకేషన్ పరంగా కూడా ఇది చక్కని ప్లేస్ లో ఉంది. హైటెక్ సిటీకి 30 నిమిషాల్లో, ఫైనాన్షియల్ జిల్లాకు 20 నిమిషాల్లో వెళ్లొచ్చు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 5 నిమిషాల దూరంలో ఉండగా.. ఇక్ఫై బిజినెస్ స్కూల్ 10 నిమిషాల దూరంలో ఉంది. కాంటినెంటల్ హాస్పటల్ 20 నిమిషా దూరంలో, స్కై జోన్ 10 నిమిషాల దూరంలో ఉంది. ఇక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 45 నిమిషాలో చేరుకోవచ్చు.
ప్రాజెక్టు విషయానికి వస్తే.. లొకేషన్ పరంగా మంచి ప్లేస్ తోపాటు 70 శాతం ఓపెన్ ఏరియా ఉండటం వల్ల తాజా గాలి, వెలుతురు అనుభూతి చెందొచ్చు. అలాగే వాస్తు అనుకూలంగా ఈ ప్రాజెక్టు రూపొందించారు. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ తోపాటు ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ వంటివి కూడా ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రాజెక్టులో చదరపు అడుగు ధర కేవలం రూ.5,799 మాత్రమే ఉండటం అన్నిటికంటే ముఖ్యమైన అంశం. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే జీహెచ్ఆర్ కాలిస్టో ప్రాజెక్టు సందర్శించి మీ ఫ్లాట్ బుక్ చేసుకోండి.

This website uses cookies.