Categories: LEGAL

మోసం చేసిన బిల్డర్ కి బెయిల్ నిరాకరణ

పలువురు కొనుగోలుదారులను మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రుద్ర గ్రూప్ ప్రమోటర్, బిల్డర్ ముఖేష్ ఖురానాకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు అధికారికి ఆయన సహకరించకపోవడాన్ని ఇక్కడ గమనించాల్సిన అంశమని, అలాగే ఆయన్ను కస్టడీకి తీసుకునే అంశాన్ని కూడా విస్మరించాల్సిన పని లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఈ కేసు కేవలం ఫ్లాట్ల అప్పగింతలో జాప్యానికి సంబంధించింది మాత్రమే కాదని, ఒకరికి అమ్మిన ఫ్లాట్లను తప్పుడు డాక్యుమెంట్లతో మరోకరికి విక్రయించినట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఖురానాతోపాటు ఆయన భార్య బబిత, సన్నిహితులు నితిన్ దువా, సంజీవ్ అరోరా, విజయ్ శుక్లాలు కలిసి తప్పుడు హామీలు, పత్రాలతో పాలెస్ హైట్స్ లోని 11 ఫ్లాట్లను అక్రమంగా విక్రయించారని ప్రాసిక్యూషన్ నివేదించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ముఖేష్ ఖురానా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

This website uses cookies.