Categories: LATEST UPDATES

కొత్త లేఔట్ నిబంధనలపై అఫిడవిట్ వేయండి

  • ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం

కొత్త లేఔట్ నిబంధనలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేఔట్లలోని 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలంటూ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ ప్రకృతి అవెన్యూస్ ఎండీ మేడికొండూరి లక్ష్మీ శకుంతలా దేవి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అక్రమంగా, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అలాంటి నిబంధనలను రూపొందించే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకు లేదని నివేదించారు. ప్రైవేటు ప్రాపర్టీని ప్రభుత్వానికి అప్పగించాలని కోరే అధికారం లేదన్నారు. ప్రభుత్వ చర్య పూర్తి ఏకపక్షంగా ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

This website uses cookies.