Categories: LEGAL

విచారణ లేకుండా ఏడాదిగా జైల్లో ఉంచారా?

  • మహారాష్ట్ర వినియోగదారుల కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం

కేసు విచారణ పూర్తి చేయకుండా ఓ వ్యక్తిని ఏకంగా ఏడాదిపాటు జైల్లోనే ఉంచడంపై బోంబే హైకోర్టు నాగ్ పూర్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని మహారాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ పై మండిపడింది.

రేవతి అసోసియేట్స్ డైరెక్టర్ సుహాస్ మోరే వద్ద కటోల్ కు చెందిన ధనరాజ్ ఖాప్రాడే అనే వ్యక్తి రూ.65 లక్షలకు మూడు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం తొలుత రూ.55 లక్షలు చెల్లించారు. అయితే, ఆ ప్లాట్లను మోరే అప్పగించకపోవడంతో వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. దీనిని విచారించిన కమిషన్.. మోరేకు వడ్డీతో సహా రూ.55 లక్షలు చెల్లించాలని 2016 అక్టోబర్ 21న ధనరాజ్ ను ఆదేశించింది. అయితే, ధనరాజ్ ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కమిషన్ ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.

తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఈ క్రమంలో గతేడాది జనవరి 6న తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు కమిషన్ ముందు హాజరైన ధనరాజ్ పై జడ్జీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేళ్లైనా తమ ఆదేశాలు అమలు చేయకపోవడంతో బెయిల్ రద్దు చేశారు. అప్పటినుంచి జైల్లోనే ఉన్నారు. నాలుగుసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు విన్న ధర్మాసనం..

కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘కమిషన్ ప్రొసీడింగ్స్ చూస్తుంటే ఈ రోజు వరకు కూడా ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పిటిషనర్ కస్టడీలో ఉన్నప్పటికీ విచారణ ముందుకు సాగలేదు. కానీ ఏడాదిగా పిటిషనర్ జైల్లోనే ఉన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే’ అని పేర్కొంది.

This website uses cookies.