షెడ్యూల్ ప్రకారం గురువారం 11 గంటలకు బుద్వేల్ ప్లాట్ల ఆన్ లైన్ వేలం పాటలు ఆరంభమైంది. ఇందులో ప్లాట్ల కొనుగోలుదారులు (బిడ్డర్లు, డెవలపర్లు) ఉత్సాహంగా వేలం ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిసింది. బుద్వేల్ భూములపై హైకోర్టులో విచారణ సందర్భంగా హెచ్ఎండిఏ అడ్వకేట్లు గట్టిగా వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు పూర్తి రికార్డులను అడ్వకేట్స్ కు అందజేశారు. అక్కడే కొంతమంది ఉన్నారు. నూటికి నూరు శాతం బుద్వేల్ భూములు ప్రభుత్వ భూములేనని రికార్డుల ఆధారంగా వాదించారు. దీంతో, బుద్వేల్ భూముల వేలంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
This website uses cookies.