గోదావరి ప్రాంత రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు నవంబర్ 6 నుంచి ఏపీలోని రాజమహేంద్రవరంలో నాలుగో హోమ్ ఎక్స్ పో నిర్వహించనున్నట్టు క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ చైర్మన్ సురవరపు శ్రీనివాస్ కుమార్ తెలిపారు. నగరంలోని సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ లో మూడు రోజులపాటు జరిగే ఈ ఎక్స్ పోలో బ్యాంకులు, భవన మెటీరియల్స్, నిర్మాణ సంస్థలకు చెందిన దాదాపు 90 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
ఇంటీరియర్, బిల్డింగ్ మెటీరియల్ ను ప్రదర్శించడంతోపాటు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీల టౌన్ షిప్స్ వివరాలను సందర్శకులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఏపీ హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ ఈ ఎక్స్ పో ప్రారంభిస్తారని.. దాదాపు 20 వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్టు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా క్రెడాయ్ గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాసులు, అధ్యక్షుడు శేఖర్ రెడ్డి కర్రి, ప్రధాన కార్యదర్శి చల్లా మురళితో కలిసి హోమ్ ఎక్స్ పో బ్రోచర్‌ను విడుదల చేశారు. చివరి హోమ్ ఎక్స్ పో 2019లో జరిగింది. కరోనా కారణంగా తర్వాత నిలిపివేశారు.
This website uses cookies.